Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

రఘునందన్ మరణశిక్ష వాయిదా ?

int

వాషింగ్టన్: అమెరికాలో భారత ఖైదీ యండమూరి రఘునందన్ (32)కు విధిం చిన మరణశిక్ష షెడ్యూల్ ప్రకారం అమలు జరగక పోవచ్చని తెలుస్తోంది. మర ణ శిక్ష అమలుపై 23 ఫిబ్ర వరి 2015న పెన్సిల్వేనియా గవర్నర్ మారటోరియం విధించారని సీనియర్ అధికారులు తెలిపారు. ఆంధ్రప్ర దేశ్‌కు చెందిన సత్యవతి వెన్న(61), పది నెలల వయసున్న ఆమె మనవ రాలు సాన్విని రఘునందన్, డబ్బుల కోసం వారిని కిడ్నాప్ చేసేందుకు యత్నించి, హత్య చేశాడు. ఫిబ్రవరి 23న ప్రాణాంతక ఇంజెక్షన్ ఇవ్వడం ద్వారా అతనికి మరణ శిక్ష అమలు చేయాలనే ఉత్తర్వులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ కరెక్షన్ వారం క్రితం సంతకం చేసింది. ఉరిశిక్ష అమలు కన్నా ముందు రఘునం దన్ తన సన్నిహిత బంధువు, వకీలు, ఆధ్యాత్మిక సలహా దారుడిని మాత్రమే కలిసేందుకు అవకాశ మిస్తారు. అమెరికాలో మరణ శిక్షను ఎదుర్కొన్న తొలి భారత ఖైదీ రఘునం దన్. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ రఘునందన్ ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్‌లో అడ్వాన్స్ డ్ డిగ్రీ చదివారు. హెచ్1 బి వీసాతో అమెరికాకు వెళ్లాడు.

Comments

comments