Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మల్టీస్టారర్‌లో రకుల్ ప్రీత్

Rakul

తన రేంజ్‌ను నిలకడగా పెంచుకుంటున్నాడు యంగ్‌స్టార్ నాని.  మీడియం రేంజ్ హీరో నుంచి నాని మెల్లిగా స్టార్ హీరో రేంజ్ దిశగా వెళ్తున్నాడు. అయితే అప్పుడెప్పుడో ‘ఈగ’ సినిమాలో సమంతను మినహాయిస్తే ఇప్పటివరకు అతను స్టార్ హీరోయిన్‌లతో కలిసి పనిచేయలేదు. ఇప్పుడు నాని పక్కన నటించేందుకు ఓ టాప్ లీగ్ భామ ఓకే చెప్పిందని సమాచారం. ఇంతకీ ఆమె ఎవరో కాదు… రకుల్‌ప్రీత్ సింగ్. మహేష్‌బాబు ‘స్పైడర్’ తర్వాత ఇప్పటివరకు కొత్తగా ఏ తెలుగు సినిమాకు ఆమె సైన్ చేయలేదు. కానీ ఇప్పుడు నానీతో మూవీకి ఈ బ్యూటీ సైన్ చేసినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో మంచి హిట్ కొట్టాలని అనుకుంటోంది. అలాంటి సమయంలో నాగార్జున, నాని కాంబినేషన్‌లో వస్తున్న మల్టీస్టారర్‌లో ఆమెకు ఛాన్స్ వచ్చింది. ఇందులో నానీకి జోడీగా రకుల్ చేయనుంది. దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య ఆమెకు ఈ అవకాశాన్ని అందించాడు. నానీపై ఉన్న నమ్మకంతో వెంటనే దీనికి ఒప్పుకుందంట ఈ పంజాబీ బ్యూటీ. ఇలా ఓ మల్టీస్టారర్‌లో ఆఫర్ అందుకున్న రకుల్ పాత్రకు ఇందులో ఎంతో ప్రాముఖ్యత ఉంటుందని తెలిసింది.

Comments

comments