Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

కోరలు, పంజాలేని పులిని చూడలేను: ఆర్ జివి

రాంగోపాల్ వర్మ మళ్లీ పవన్ నటించిన అజ్ఞాత‌వాసి సిినిమా పై ట్వీట్ చేశాడు.  ఈ సినిమాలో పులిని చూశా…  కోరలు, పంజాలేని పులిని చూడలేనని వ్యంగంగా తెలిపారు. పులికి చారలు మారడం తనకు ఒకింత ఆశ్చర్యానికి గురి చేసిందని పేర్కొన్నారు. పులి జంపింగ్ చేయాలి… కానీ పాకడం చూస్తే తనకు బాధ కలుగుతోందన్నారు. కత్తి మహేశ్ రివ్యూపై ప్రశంసల జల్లు కురిపించాడు. కత్తి మహేశ్ రివ్యూ వీడియో చూశానని, చాలా బాగుందని పొగిడారు. పవన్ కన్నా కత్తి చాలా అందంగా కనిపించాడని మెచ్చుకున్నాడు. దీనికి కత్తి మహేశ్ ఆర్ జివికి ధన్యవాదాలు తెలిపారు.  అదిగో తెల్ల కాకి ఇదిగో పిల్ల కాకి అన్నట్టుగా కత్తి, రాంగోపాల్ వర్మల వ్యవహారం ఉందని జబర్ధస్ ఫేమ్ హైపర్ ఆది కామెంట్ పెట్టాడు. కత్తి, ఆర్ జివిపై పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Comments

comments