Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రమణీయం రంగనాథుని రథోత్సవం

god

* ఉత్సాహంగా సాగిన ఊరేగింపు
* కన్నుల పండువగా చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు

మన తెలంగాణ/సంగారెడ్డి టౌన్ : అంగరంగ వైభవం గా రంగనాథుని రథోత్సవ ం కన్నుల పండువగా సాగి ంది. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా సంగారెడ్డి పట్ట ణంలో గల వైకుంఠ పురం లో గల విరాఠ్ వెంకటేశ్వర స్వామి  రథోత్సవం ఉదయం 12 గంటలకు పోతిరెడ్డిపల్లి చౌరస్తా నుంచి సంబరంగా సాగుతూ వచ్చింది. అడుగడుగున రంగవల్లులు దిద్దుతూ ఆడపడుచులు స్వాగతం పలికా రు. లోకనాయకుడైన వెంకటేశ్వర స్వామి వేయించేస్తు న్న దృశ్యాలు మనోహరంగా కనిపించాయి. గుర్రాల కవాతు, భాజభజంత్రీలతో నారాయణ నామస్మరణం లో ముందుకు సాగింది. సుమారు 500 మంది చిన్నా రులు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా  భారత సంస్కృతి ప్రతిబించేలా భరత నాట్యం, కూచిపూడి వంటి నృత్యాలను చేస్తూ.. స్వామికి స్వాగతం పలికా రు. ఈ నృత్యాల్లో చిన్నారులు చేసే భంగిమలు రథ యాత్రకు వచ్చిన చూపరులను విశేషంగా ఆకట్టుకు న్నాయి. దారి పొడువున రథో త్సవానికి ఆరతులు ఇస్తూ పట్టణ వాసులు స్వామి రథోత్సవాన్ని స్వాగ తించారు. ప్రతి యేడు ధనుర్మాసంలో  సంగా రెడ్డి పట్టణంలో రథోత్సవంలో భక్తులను కనువిందు చే సేందుకు గోవిందుడు రావడం తమకెంతో ఆనందంగా ఉందని పలువురు అభిప్రాయపడ్డారు. రథోత్సవ వేడుక ల్లో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘ టనలు జరు గకుండా డిఎస్‌పి శ్రీనివాస్ కుమార్ ఆధ్వర్యంలో సిఐ రామక్రిష్ణారెడ్డి, ఎస్‌ఐ లకా్ష్మరెడ్డి, ఏఎస్‌ఐలు, కానిస్టే బుళ్లు అడుగడుగునా ఉంటూ ట్రాఫిక్‌ను సైతం కట్టడి చేశారు. ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో రథోత్సవం వెంబడి ప్రసాద వితరణ చేశారు. మొత్తానికి రంగనాథుని రథో త్సవం కన్నుల పండువగా సాగింది.

Comments

comments