Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

అందాల వనం రాష్ట్రపతి నిలయం

Rastrapathi-bhavan

అందాల లోకం అద్భుతమైన పూల ప్రపంచం హైదరాబాద్‌లోని రాష్ట్రపతి నిలయం. భారతదేశ ప్రథమ పౌరుడి కోసం ఏర్పాటు చేసిన రెండవ విడిది . ఈ భవనాన్ని నిజాం కాలంలో నిర్మించారు. హైదరాబాద్‌లోని బొల్లారం ప్రాంతంలో ఉన్న ఈ నిలయం ప్రకృతికి ఆలవాలం. పచ్చని పరిసరాలు, వందలకొద్దీ ఔషధ, పూల మొక్కలతో స్వచ్ఛమైన ఆహ్లదకరమైన వాతవరణంతో ఉంది. దీని చుట్టూ అల్లుకున్న చరిత్ర అపురూపం. హైదరాబాద్‌లో కనిపించే చారిత్రక కట్టడాలకు అద్భతమైన నిలయం. 150 సంవత్సరాల క్రితం అప్పటి హైదరాబాద్ పాలకులు నిజాం రాజులు కట్టించిన భవనం. ఐదవ నిజాం రాజు తనకు విశ్రాంతి మందిరంగా కట్టించుకున్నాడు. 98 ఎకరాల స్థలంలో పూలు, పండ్ల చెట్లతోని పచ్చగా ఉంటుంది. ఇంతే కాదు ఈ ప్యాలెస్ చుట్టూ 50 అడుగుల ఎత్తుతో ప్రహరీ నిర్మించారు. 1860 లో కట్టించిన ఈ భవనంలో మొదట్లో నిజాం రాజులు ఉండేవారు. తరువాత బొల్లారంలో బ్రిటిష్ వారు వారి సైనికులకు క్వార్టర్స్ కట్టించారు. దాని పక్కనే ఉన్న ఈ భవనం చూసి వారు వారి సైనికాధికారి కార్యాలయంగా వాడుకుంటామని నిజాం రాజుని అడిగారు. దానికి నిజాం ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి బ్రిటిష్ కార్యాలయంగా వారు వాడుకున్నారు. అప్పట్లో దీని పేరు బ్రిటిష్ రెసిడెన్సీ అని అనేవారు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తరువాత నిజాం రాజ్యంగా ఉన్న హైదరాబాద్‌ని భారత దేశంలో విలీనం చేసారు. 1950 లో ఈ భవనాన్ని కేంద్ర ప్రభుత్వం 60 లక్షలకు కొన్నది. దీనికి కొన్ని మరమత్తులు చేయించి రాష్ట్రపతికి శీతాకాలం విడిదిగా మార్చారు.

దేశానికి మొదటి పౌరుడైన రాష్ట్రపతికి దేశం మొత్తం పైన మూడు భవనాలు ఉంటాయి. అవి ఒకటి ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్, రెండవది హిమాచల్ ప్రదేశ్‌లలోని సిమ్లా, మూడవది హైదరాబాద్‌లోని బొల్లారంలో ఉంది. ప్రతి ఏడాది శీతాకాలంలో రాష్ట్రపతి ఇక్కడికి వస్తారు. 10 నుండి 15 రోజుల పాటు ఇక్కడ ఉంటారు. ఆ సమయంలో రాష్ట్ర ప్రజలకు ప్రజాప్రతినిధులకు ఇక్కడకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మొత్తం 95 ఎకరాలు ఉంటుంది. దీనిలో 25,000 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో భవనం ఉంటుంది. మిగతా మొత్తం రకరకాల ఔషధ, పూలతో గార్డెన్ ఉంటుంది. భవనం మొత్తం మూడు భాగాలు అవి ప్రెసిడెంట్ వింగ్, ఫ్యామిలీ వింగ్ లేదా సెంట్రల్ వింగ్, ఎడీసీ వింగ్‌తో కలసి మొత్తం 20 గదులు ఉంటాయి.

మూడు వేరువేరుగా వున్న వీటిని కలుపుకుంటూ సొరంగ మార్గం ఉంది. ప్రతి వింగ్‌కి వేరువేరు వంట గదులున్నాయి. సొరంగం నుంచి ఒక వంటగది నుంచి మరో వింగ్ లో ఉన్న డైనింగ్ హాల్ దగ్గర వరకు దారి వుంటుంది. 25 మంది ఒకేసారి కూర్చోని తినడానికి వీలుగా పెద్ద డైనింగ్‌హాల్ ఇక్కడ ఉంది. ప్రెసిడెంట్ వింగ్‌లో ఉన్న సినిమా హాల్‌లో సామన్య ప్రజలను, దీని పక్కనే ఉన్న దర్బార్ హాల్ లో రాజకీయ నాయకులతో రాష్ట్రపతి సమావేశం అవుతారు. 2010లో అప్పటి రాష్ట్రపతి ప్రతిభాపాటిల్ 35 ఎకరాల్లో ఏర్పాటు చేసిన హెర్బల్ గార్డెన్‌ని ప్రారంభించారు. అందులో 4500 రకాల పండ్ల మొక్కలు 116 రకాల పూల మొక్కలు ఉంటాయి. భారత దేశ మొదటి రాష్ట్రపతి బాబూ రాజేంద్ర ప్రసాద్ నుంచి ప్రస్తుతం ఉన్న రామ్‌నాథ్ కోవింద్ వరకు ప్రతి ఒక్కరు ఈ భవనంలో విడిది చేశారు. రాష్ట్రపతి విడిది ముగిసిన తర్వాత పౌరులకు రాష్ట్రపతి నిలయాన్ని చూడటానికి అధికారులు అనుమతిస్తారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు చూడడానికి అవకాశం కల్పిస్తారు.

Comments

comments