Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

రేషన్ పరేషాన్

ration*మొరాయిస్తున్న
బయోమెటిక్ విధానం
*అవస్థలు పడుతున్న
ప్రజలు
*దుకాణం ముందు
ఎదురుచూపులు
*ఎక్కడ కూడా రసీదులు
ఇవ్వని వైనం
*గుర్తింపు కార్డులు చూసి
ఇవ్వాలంటున్న ప్రజలు

మన తెలంగాణ/జుక్కల్: రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన  బయోమెట్రిక్ మొరాయింపుతో రేషన్ సరుకులు రాక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రేషన్ డీలర్ల ఆగడాలు అరికట్టడానికి బాగా నే ఉన్నప్పటికీ ప్రజలకు మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుందని వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వేలి ముద్రలు రాక గంటల తర బడి రేషన్ దుకాణాల్లో కూర్చోని ఇంటిదారి పట్టాల్సి వస్తుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముద్రలు రాకుంటే ఒక నెల సరుకులు లేనట్లేనని వచ్చే నెలలో డీలర్లు ఇవ్వడం లేదని వారు ఆందోళన చెందు తున్నారు. ఇవే కాకుండా నెట్‌వర్క్ లేదని ప్రజలకు రేషన్ డీలర్లు ఇంటి దారి చూపుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా ఎన్నో లొసుగులు కనిపిస్తున్నాయని కూడా వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రేషన్ బియ్యం తీసుకున్న తరువాత తమకు ఎక్కడ కూడా రసీదులు ఇవ్వడం లేదని వారు పేర్కొంటున్నారు. ఆ రిసిప్ట్‌లు కూడా ప్రింట్ రావడం లేదని తెలిపారు. గంటల తరబడి  పనులు మానుకుని క్యూలైన్‌లో నిలబడాల్సి వస్తోందని అంటున్నారు. మండలంలో 19 జిపిలుండగా 30 గ్రామాలు ఉన్నాయి. కొన్ని గ్రామాలకు డీలర్లు ఇంచార్జిలుగా వ్యవహరిం చడంతో వారు నెలలో మూడు రోజులపాటు ఇచ్చి దుకాణాలు మూసేసుకుంటున్నట్లు పేర్కోంటున్నారు. బియ్యం ఒకసారి కిరొసిన్ ఒకసారి రావడంతో కొన్ని గ్రామాల్లో దండోరా వేయించపోవడంతో ఎన్నోసార్లు కిరొసిన్ కూడ లభించడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని గ్రామాల ప్రజలు కిలో మీ టర్ మేర నడుచుకుంటు వచ్చి సరుకులు తీసు కుని వెళ్ళె పరిస్థితులు కూడ ఉన్నాయి. దీంతో వారు వచ్చినతరువాత వారి వేలుముద్రలు రాకుంటే యేంతిని బతకాలని వారు ప్రశ్నిస్తు న్నారు. మండలంలోని కేంరాజ్ కల్లాలి, మహ్మదాబాద్, బిజ్జల్‌వాడి గ్రామాల కు ఇం చార్జి డీలర్లే ఉన్నారని తమకు వేలి ముద్రలు రాని వారికి గుర్తింపు కార్డులు చూసి రేషన్ సరుకులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తు న్నారు. అధికారులు స్పందించి వేలిముద్రల సంగతి తేల్చాలని వారు కోరుతున్నారు.

Comments

comments