Search
Friday 20 April 2018
  • :
  • :

రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ టీచర్ దుర్మరణం

tchr

*లారీ ఢీకొనడంతో ప్రమాదం నుజ్జునుజ్జయిన మృతదేహాం
*ట్రాఫిక్ పోలీస్‌ల వైఫల్యం?

మంచిర్యాల టౌన్: ట్రాఫిక్‌సిగ్నల్స్‌ను గమ నించ కుండా రోడ్డు దాటే క్రమం లో ప్రమాదవ శాత్తు లారీ కింద పడడంతో ద్విచక్ర వాహన దారుడు ఒకరు దుర్మరణం చెందిన సంఘటన సోమవారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌర స్తా వద్ద జరిగింది. ఈ ప్రమాద సంఘటనకు సంబంధించిన వివ రాలివి. చెన్నూర్ ప్రాంతానికి చెంది న బాకే మహేశ్వర్ రావు (65) ద్విచక్రవాహనంపై మంచి ర్యాలకు వచ్చి స్థానిక బెల్లంపల్లి చౌరస్తా వద్ద ఊహించని విధంగా ప్రమాదానికి గురైనాడు. సిగ్నల్స్‌ను గమనించకుండా రోడ్డును క్రాస్ చేసే ప్రయత్నంలో మంచి ర్యాల వైపు నుండి ఎసిసి వైపు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. లారీ డ్రైవర్ కూడా ద్విచక్ర వాహ నాన్ని గమనించకుండా వేగంగా రోడ్డును దాటే ప్రయత్నంలోనే ఈప్రమాదం జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. ప్రమాద సంఘటన నుండి సుమారు పది మీటర్ల వరకు వాహనాన్ని ఈడ్చు కెళ్లడంతో లారీ కింద పడిన మహేశ్వర్‌రావు మృతదేహం నుజ్జు నుజ్జయింది. ప్రమాద సంఘ టన తెలిసిన వెంటనే ట్రాఫిక్ సిఐ సతీష్ సంఘటన స్థలానికి చేరు కొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహేశ్వర్‌రావు గత కొద్ది నెలల క్రితమే పదవి విరమణ చేయగా ఆయనకు భార్య విజయ, కొడుకు మనోజ్, కూతురు మమతలు వున్నారు. ఈప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నట్లుట్రాఫిక్ సిఐ తెలిపారు.
ట్రాఫిక్ పోలీస్ నిర్ణక్షమే ప్రమాదానికి కారణమా?
రోడ్డు ప్రమాదంలో రిటైర్డ్ టీచర్ దుర్మరణం వెనుక ట్రాఫిక్ పోలీస్‌ల నిర్లక్షమే కారణమన్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక ఐబి ప్రాంతం నుండి బెల్లంపల్లి చౌరస్తా వైపు వెళ్లే రాష్ట్రీ య రహదారి గుండా భారీ వాహనాలకు అనుమతి నిషేధం. బైపాస్‌రోడ్ గుండా భారీ వాహ నాలు వెళ్లేవిధంగా ట్రాఫిక్ నియంత్రణ చర్యలను పోలీస్‌లు చేపట్టినప్పటికి కొన్ని వాహనాలు యధావిధిగా నిషేదిత ప్రాంతం గుండా రాకపోకలు సాగిస్తున్నాయి. సోమవారం కూడా బైపాస్ రోడ్ గుండా వెళ్లాల్సిన లారీ ప్రధాన రహదారి గుండా రావడం వలనే ప్రమాదానికి కారణమై ఒకరి దుర్మరణానికి కారణమైనట్లు తెలుస్తోంది. ఈఘటన జరిగిన తీరును చూసిన పలువురు పోలీస్‌ల తీరును విమర్శిస్తున్నారు.
వాహనాల తనిఖీచేసిన పోలీసులు

Comments

comments