Search
Sunday 21 January 2018
  • :
  • :

ఈసారికి కటౌట్‌తో కానిచ్చేయండి డూడ్..!

Thai-PM

బ్యాంకాక్: థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా ఓ కార్యక్రమంలో ప్రవర్తించిన తీరు ప్రస్తుతం వైరల్ అవుతోంది. ప్రధాని ప్రయూత్ త్వరలో దేశంలో నిర్వహించనున్న బాలల దినోత్సవం ఏర్పాట్లపై సోమవారం ప్రసంగించారు. ఈ సందర్భంగా ప్రధాని ప్రయూత్‌ను మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలు సంధించి ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే వారి ప్రశ్నలకు బదులివ్వకుండానే వింతగా ప్రవర్తించారు ప్రధాని. వేదిక మీద ఏర్పాటు చేసిన ఆయన కటౌట్‌ను చూపిస్తూ… ఆయన మీ ప్రశ్నలకు బదులిస్తారంటూ చిరునవ్వు చిందిస్తూ ప్రయూత్ స్టేజీపై నుంచి వెళ్లిపోయారు. ఊహించని ప్రధాని ఈ వింత ప్రవర్తనతో అక్కడున్న మీడియా ప్రతినిధులు ఒక్కసారి కంగుతిన్నారు.  కొసమెరుపు ఏమిటంటే ఓ అధికారి ప్రయూత్ కటౌట్ ముందు మైక్ ను ఉంచడం. ప్రధాని ప్రయూత్ ప్రవర్తించిన తీరుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి.

Rights group Criticises Thai PM’s Cardboard Cutout Gesture.

Comments

comments