Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

ఆ జైల్లో ఉండను : లాలూ

LALU-

రాంచీ : దాణా కుంభకోణంలో మూడున్నరేళ్ల జైలు శిక్ష పడిన ఆర్‌జెడి చీఫ్, బిహార్ మాజీ సిఎం లాలూ ప్రసాద్ యాదవ్ తనకు ఓపెన్ జైల్లో ఉండడం ఇష్టం లేదని సిబిఐ కోర్టు జడ్జి శివపాల్‌సింగ్‌కు తెలిపారు. ఈ కేసులో శిక్షతో పాటు ఆయనకు పది లక్షల రూపాయల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఓపెన్ జైల్లో ఉండనని, తన కారణాలు తనకు ఉన్నాయని ఆయన సిబిఐ కోర్టు జడ్జికి విన్నవించారు. ఈ విషయాన్ని దుమ్కా జిల్లా ట్రెజరీ కేసు విచారణ సమయంలో ఆయన జడ్జికి తెలిపారు. అయితే ఓపెన్ జైల్లో కుటుంబ సభ్యులతో కూడా కలిసి ఉండొచ్చని, ఈక్రమంలోనే లాలూకు ఆ జైలు కేటాయించామని జడ్జి చెప్పారు. దీంతో లాలూ స్పందించారు. ఆ జైలు నక్సలైట్ల కోసం కేటాయించిందని పేర్కొన్నారు. 2013లో హజారీభాగ్‌లో ఓపెన్ జైలును ప్రారంభించారు. ఇందులో కుటుంబ సభ్యులతో కలిసి ఉండేందుకు వంద కాటేజీలు కూడా ఉన్నాయి. ఈ జైలును లొంగిపోయిన నక్సలైట్లు, విచారణలో ఉన్న ఖైదీలకు కోసం నిర్మించారు. దాణా కుంభకోణం కేసులో దోషులు పశువులకు దాణా, ఔషధాలను సరఫరా చేయడంలో నిపుణులు అయినందు వల్ల డెయిరీ అభివృద్ధికి పాటుపడుతారన్న ఉద్దేశంతోనే వారిని ఓపెన్ జైలుకు పంపించినట్టు జడ్జి శివపాల్‌సింగ్ తన తీర్పులో పేర్కొన్నారు.

RJD Chief Lalu Comments on Open Jail

Comments

comments