జైపూర్ : రాజస్థాన్లోని భరత్పూర్లో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే చనిపోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. వేగంగా వచ్చిన కారు మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మృతుల వివరాలు తెలియరాలేదు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.