Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

లారీ బీభత్సం – ఒకరి మృతి

car

 తప్పిన పెను ప్రమాదం  ఉలిక్కిపడిన పట్టణ ప్రజలు

తాండూరు టౌన్ : తాండూరు పట్టణంలో సోమవారం తెల్లవారు జామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.అప్పుడే తేరుకుంటున్న పట్టణ ప్రజలు ఈ సంఘటనతో ఒక్కరిసారిగా ఉలిక్కిపడ్డారు.తాండూరు పట్టణంలోని అంబేద్కర్ చౌక్‌లో అతివేగంగా వస్తున్న లారీ సృష్టించిన బీభత్సంలో  ఒకరు మృతి చెందగా పెను ప్రమాదం తప్పింది.పొద్దునే పాల విక్రయానికి వచ్చిన ఆ పాల వ్యాపారిని లారీ పొట్టన పెట్టుకుంది.కోడంగల్ మార్గం మీదుగా బొగ్గు లోడు లారి ఉదయం 5-20గంటల సమయంలో పట్టణంలోని అతివేగంగా వచ్చిన లారీ  బాలాజీ డీలక్స్ లాడ్జ్ ముందు పాల వ్యాపారం చేస్తున్న శ్రీశైలం(45)ను ఢీ కోట్టడంతో పాటు ఆయన పైను నుండి దూసుకపోయి లాడ్డ్ ముందు పార్కింగ్ చేసిన కారును సైతం డికోట్టింది. కారును ఢీకోట్టిన లారి లాడ్జి సెల్లార్‌లోకి దూసుకపోయింది.కారులులో ఎవ్వరు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.ప్రమాదం జరిగిన వెంటనే లారి డ్రైవర్ అక్కడి నుండి పారిపోయ్యాడు.మహారాష్ట్ర పాసింగ్ ఉన్న లారి బొగ్గుతో తాండూరు వైపు వస్తున్నది. లారి అతివేగంతో దూసుక రావడంతో పాలవ్యాపారి దుర్మణం పాలైనాడు.వికారాబాద్ జిల్లా ద్యాసరం గ్రామానికి చెందిన పాలవ్యాపారి శ్రీశైలం గత కొంత కాలంగా తాండూరు పట్టణంలో నివాసం ఉంటూ పాలు ప్యాకెట్లను విక్రహిస్తున్న జీవనం వెల్లదీస్తున్నారు.ఎప్పటి లాగనే సోమవారం తెల్లవారు జామున ఇంటి నుండి అంబేద్కర్ చౌక్ బాలాజీ లాడ్డ్ వద్ద పాల ప్యాకట్లను దించుకుని విక్రహిస్తున్న సమయంలో కోగండల్ ప్రాంతం నుండి అతివేగంగా దూసుక వచ్చిన లారి ఒక్కసారిగా ఢీ కోట్టడంతో పాలవ్యాపారి శ్రీశైలం అక్కడిక్కడే మృతి చెందాడు.శ్రీశైలం ఇద్దరు కుమారులు ఉన్నారు.తండ్రి మృతితో బంధువుల రోదనలు మిన్నంటాయి.బంధువుల ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తాండూరు పోలీసులు తెలిపారు.

Comments

comments