Search
Saturday 21 April 2018
  • :
  • :

భారతీయుడికి రూ.21 కోట్ల లాటరీ

latari-won-image

దుబాయి: యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో భారత జాతీయుడు ఒకరు 12 మిలియన్ దిర్హాంలను గెలిచి హఠాత్తుగా కోటీశ్వరుడు అయిపోయాడు. ఇది 3.2 మిలియన్ డాలర్లతో సమానం. అబుదాబిలో ఇది చరిత్రలో ఎన్నడూ లేనంత అతిపెద్ద లాటరీ సొమ్ము. 42 ఏళ్ల హరికిషన్ వి నాయర్ దుబాయిలోని ఒక సంస్థలో వ్యాపారాభివృద్ధి వ్యవహారాల మేనేజర్‌గా పనిచేస్తున్నారు. 2002 నుంచి ఆయన అక్కడ నివసిస్తున్నారు. నిన్న ‘బిగ్ టికెట్ రాఫిల్ డ్రా’లో ఈ భారీ మొత్తం గెలిచారు. కేరళకు చెం దిన నాయర్ ఇంతకు ముందు రెండు సార్లు ఆ టికెట్ కొన్నానని, ఈ సా రే అనూహ్య ఫలితం వచ్చిందని అన్నారు. ప్రపంచ పర్యటన జరపాలని కోరుకునేవాడినని ఇప్పుడది తీరబోతోందని సంతోషం వ్యక్తం చేశాడు.

Comments

comments