Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

మార్చి 31 వరకు రూ.288 కోట్లు

hall

*డిండి బ్యాలెన్సింగ్ రిజర్యాయర్, ఎస్‌ఎల్‌బిసీ పనులకు నిధుల వివరాలు వెల్లడి
*వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ వివరించిన కలెక్టర్ గౌరవ్ ఉప్పల్

మన తెలంగాణ/నల్లగొండ ప్రతినిధి: రాష్ట్రంలో చేపడుతు న్న వివిధ భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు మార్చి 31 వరకు అవసరమున్న నిధుల వివరాలను జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, ఎక్సిక్యూటీవ్ ఇంజనీర్లు, ఎస్‌డీసీలు, పీఎటు స్పెషల్ కలెక్టర్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరె న్స్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రెటరీ ఎస్పీ సింగ్ సమీక్షించారు. మంగళవారం హైదరాబాద్ నుంచి వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, ఈఈలు, జేసీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణానికి ప్రభు త్వం ఎంతో ప్రాధాన్యత ఇస్తుందని, ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయాలని అందుకుగాను మార్చి 31 వరకు వివిధ జిల్లాలకు అవసరమయ్యే నిధుల వివరాలను ఆయన సేకరించారు. ఇప్పటి వరకు మంజూరి నిధులకు యుటిలైజేషన్ సర్టిఫికేట్లు అన్ని జిల్లాల నుంచి రావలసివున్నదని అది వెంటనే పంపించాలని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. జిల్లా కలెక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ డిండి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పనులకు, ఎస్‌ఎల్‌బిసీ పనులకు మార్చి 31 వరకు గాను ఈ  288 కోట్లు అ వసరం ఉన్నట్లు దానికి సంబంధించిన వివరాలను అందజేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు మంజూరు చేయబడిన నిధులకు యూటిలైజేషన్ అందజేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఎస్‌ఎల్‌బిసీ ఎస్సీ అమీద్‌ఖాన్, డిండి లిప్టు ఇరిగేషన్ ఎస్సీ వెంకటేశవర్లు, డీఆర్‌ఒ ఖీమ్యానాయక్, నల్లగొండ ఆర్‌డిఓ ఇ. వెంకటాచారి, దేవరకొండ ఆర్‌డిఒ లింగ్యానాయక్, ఎస్‌డిసీలు గోపాల్, చంద్రశేఖర్, వివిధ ప్రాజెక్టుల ఎస్సీలు, ఈఈలు, డీఈలు, జిల్లా కలెక్టర్ ఏఓ మోతీలాల్, ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Comments

comments