Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

అంతరిక్షంలో ఫైవ్ స్టార్ హోటల్

Hotels-image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఫైవ్‌స్టార్ హోటల్‌ను నిర్మించనున్నట్లు రష్యా అంతరిక్ష సంస్థ ‘రాస్ కాస్మోస్’ వెల్లడించింది. హోటల్ నిర్మాణానికి రూ. 8వేల కోట్ల నుంచి రూ. 28వేల కోట్ల వరకు ఖర్చవుతోందని తెలిపింది. భూమికి అతి దగ్గరగా ఉండే మానవ నిర్మిత ఉపగ్రహానికి పర్యాటకులను అనుమతిస్తామన్నారు. వారు తమకు కేటాయించిన హోటల్ గదుల్లో నివసించవచ్చు. అంతేకాకుండా ఉపగ్రహ ఉపరితలంపై తిరగొచ్చు. సెల్ఫీలు తీసుకోవచ్చు. రెండేసి ఘనపు మీటర్ల పరిమాణంలో నాలుగు గదులుండే ఈ హోటల్ నుంచి భూగ్రహాన్ని చక్కగా వీక్షించవచ్చు. ఒకటి నుంచి రెండు వారాలపాటు హోటల్‌లో బసచేసే అవకాశం ఉంటుంది. పర్యాటకుల నుంచి రూ.256 కోట్ల వరకు కిరాయి వసూలు చేయనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. ఎవరైనా ఉత్సాహపడి నెలరోజులు ఉండాలనుకుంటే అదనంగా మరో రూ.28 కోట్ల ఖర్చును భరించాలని పరిశోధకులు పేర్కొన్నారు.

Comments

comments