Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

సబ్సిడీ గొర్రెలను విక్రయిస్తే కఠిన చర్యలు

nbd

తొర్రూరు : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పేద గొల్ల కురుమలను ఆర్థికంగా అభివృద్ధి చేయాలనే లక్షంతో 75 శాతం సబ్సిడీకి గొర్రెలను అందించడం జరుగుతున్నదని, గ్రామాలలో కొంతమంది లబ్ధిదారులు సబ్సిడీ గొర్రెలను విక్రయిస్తున్నారని, అలా జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత పశు వైద్యాధికారులతో పాటు గ్రామంలో ఉన్న యాదవ సొసైటీలకు ఉన్నదని ఆయన అన్నారు. డివిజన్ కేంద్రంలోని పోలీసు స్టేషన్‌లో సోమవారం సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్‌లో సబ్సిడీ గొర్రెలను విక్రయిస్తున్న వారిపై 11 కేసులను నమోదు చేసి 600 జతల గొర్రెలను స్వాధీనం చేసుకోవడంతో పాటు రూ. 7లక్షల నగదును సీజ్ చేశామని ఆయన తెలిపారు. మన ప్రాంతానికి గొర్రెలను విక్రయించిన అనంతపురానికి చెందిన వ్యక్తులే ఇక్కడకు వచ్చి గొర్రెలను కొనుగోలు చేస్తున్నారని, అలా జరుగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రభుత్వ పథకాలు పక్కదారి పట్టకుండా చూడాలన్నారు. జిల్లా పశువైద్యాధికారి కె. ప్రవీన్‌కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో ఉన్న యాదవ సొసైటీల ద్వారా రెండు విడుతలుగా గొర్రెలను అందించాలని ప్రభుత్వం లాటరీ పద్ధతిన లబ్ధిదారులను ఎంపిక చేసి గొర్రెలను అందించడం జరిగిందని, జిల్లాలో ఇప్పటికే 1.40 లక్షల గొర్రెలను అందించడం జరిగిందని ఆయన తెలిపారు. వచ్చే మార్చి వరకు మిగిలిన లబ్ధిదారులకు గొర్రెలను అందిస్తామన్నారు. ఎవ్వరూ గొర్రెలను విక్రయించినా చట్టపరంగా 420, 404 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేయడంతో పాటు జంతు హింస నివారణ చట్టం కింద నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేయించడం జరుగుతుందన్నారు. ఇప్పటికే గొర్రెలను విక్రయించిన 7 సొసైటీలను బ్లాక్ లిస్టులో పెట్టడం జరిగిందన్నారు. ఈకార్యక్రమంలో సిఐలు చేరాలు, శ్రీనువాస్, ఎస్‌ఐలు తాహెర్ బాబా, ప్రవీన్‌కుమార్, పవన్ కుమార్, రాజ్ కుమార్, వైద్యులు వెంకన్న, రామచంద్రయ్య, ప్రియాంక, రాజు, సందీప్, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments