Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

శాంసంగ్ ‘గెలాక్సీ 8 ప్లస్’ వచ్చేసింది…

Samsung-Galaxy-A8+

ముంబయి: మొబైల్ దిగ్గజం శాంసంగ్ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. గెలాక్సీ సిరీస్‌లో భాగంగా గెలాక్సీ 8 ప్లస్‌ను తీసుకువచ్చింది. ఈ ఏడాది గెలాక్సీ ఆన్ నెకట్స్ తరవాత సామ్సంగ్ నుంచి వచ్చిన రెండో ఫోన్ ఇది. ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో డ్యుయల్ సెల్ఫీ కెమెరా తొలి డివైస్‌ను కస్టమర్లకు అందిస్తోంది. బ్లాక్, గోల్డ్ కలర్స్ లో ఇది లభ్యం కానుంది. తాజాగా విడుదలైన గెలాక్సీ ఎ8+ అమ్మకాలు జనవరి 20 నుంచి అమెజాన్‌లో ప్రారంభం కానున్నాయి. దీని ధరను రూ.32,990గా నిర్ణయించింది. డ్యూయల్ ఫ్రంట్ కెమెరా దీని ప్రత్యేకత. ముందువైపు 16 ఎంపి ప్రాథమిక కెమెరా, 8 ఎంపి రెండో కెమెరా ఉన్నాయి. ఈ సెల్ఫీ కెమెరాలతో పోర్ట్‌రైట్ మోడ్ షాట్స్ కూడా తీసుకోవచ్చు. అంతేకాకుండా దీనికి కొత్తగా ‘లైవ్ ఫోకస్’ ఫీచర్ కూడా ఉంది. దీంతో వినియోగదారుడు ‘బొకే’ ఎఫెక్ట్‌తో ఫోటోలు తీసుకోవచ్చు. అలాగే వెనుకవైపు 16 ఎంపి కెమెరా ఉంది. 6 అంగుళాల ఎఫ్‌హెచ్‌డి సూపర్ అమోలెడ్ ఇన్‌ఫినిటీ డిస్‌ప్లే, ఆక్టాకోర్ ఎగ్జీనాస్ 7885 ప్రాసెసర్‌ను దీనిలో అమర్చారు. 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. మైక్రోఎస్డీతో 256జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునే సదుపాయం ఉంది. ముందువైపు ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.0 నౌగాట్ ఆపరేటింగ్ సిస్టమ్, డ్యుయల్ సిమ్, 4జి విఒఎల్‌టిఇ, యూఎస్‌బి టైప్-సి, 3,500 ఎంఎహెచ్ బ్యాటరీతో మొబైల్‌ను రూపొందించారు. అంతేగాక సులభ లావాదేవీల కోసం ఈ డివైస్‌లో శాంసంగ్ పే కూడా జోడించారు.

Comments

comments