Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ప్రభుత్వ కనుసన్నల్లోనే ఇసుక మాఫియా

sit

*విఆర్‌ఎ హత్యపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిల పక్షాన్ని తీసుకెళ్లాలి
*రబీలో నీరందించకపోతే ఎకరానికి రూ.50వేలు చెల్లించాలి
*కెసిఆర్ మాటకు కట్టుబడి ఉండాలి: బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి

మనతెలంగాణ/కరీంనగర్‌ప్రతినిధి: తెలంగాణ రాష్ట్రంలో ఇసుక మాఫియా దందా ప్రభుత్వ కనుసన్నల్లోనే నడుస్తుం దని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుజ్జుల రామకృష్ణరెడ్డి ఆరో పించారు. ఆదివారం నగరంలోని ఆర్ అండ్ బి అతిథి గృ హంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బిజెపి జిల్లా అధ్యక్షుడు ఇసుక మాఫియా చే తులోకీలుబొమ్మగా మారినా కెసిఆర్ ప్రభుత్వం ప్రజల ప్రా ణాలను బలితీసుకుంటుందని వారు విమర్శించారు. సిఎం బంధువుల హస్తం లేకపోతే ఇప్పటి వరకు నలభై రెండు మంది మృతి చెందిన సిఎం కెసిఆర్ ఎందుకు స్పందిం చాలేదో స్పష్టం చేయాలని వారు డిమాండ్ చేశారు.ఇసుక మాఫియా చేతిలో మృతి చెందిన 42 మంది హత్యలకు ప్ర భుత్వమే బాధ్యత వహించాలని వారు డిమాండ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో విఆర్‌ఎ వ్యవస్థ అనల్‌దార్,ఇస్పా దార్ వ్యవస్థతో నడుస్తుదంని కేటీఆర్ మీకు తెలువకుంటే మీ నాయినాని అడిగి తెలుసుకోవాలని వారు చురకలు అ ంటించారు. కామారెడ్డి జిల్లాలో వీఆర్‌ఏ సాయులు హత్య పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంను తీసుకెళ్లా లని వారు డిమాండ్ చేశారు. ఇసుక దందా కొనసాగించ డం కోసం ఎల్‌ఎండి నీటిని విడుదల చేశారని వారు ఆరోపించారు. మృతి చెందిన సాయులపై అసత్య ప్రచారలు చేసి వారి కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేయవద్దని వారు కెటిఆర్‌ని హెచ్చరించారు. ఇసుక మాఫియా పేరుతో వేల కోట్ల కుంభ కోణం జరుగుతుందని దీనికి కెసిఆర్ కుటుంబం హస్తం ఉందని వారు ఆరోపించారు. 2017 డిసెంబర్‌లోగా ఇంటింటికి నీళ్లువ్వకపోతే ఓట్లు అడుగనన్నా కెసిఆర్ ఆ మాటా మీద కట్టుబడి ఉండాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజలు ఉద్యమ స్పూర్తి గ లవారని మల్లి అధికారం ఇవ్వరాని భావించి ముఖ్యమంత్రి కెసిఆర్ కుంటుంబం అందినకడికి దోచుకుంటున్నారని వారు విమర్శించారు. అనంతరం బిజెపి జిల్లా అధ్యక్షులు కొత్త శ్రీనివాస్ రె డ్డి మాట్లాడుతూ మద్యపాన నిషేదం విధించాలని నేడు నగరంలోని అబ్కార శాఖ (ఎక్సైజ్ కా ర్యాలయం) కార్యాలయం ముందు బిజెపి మహిళా మోర్చా ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం  ర్వహించడం జరుగుతుందని కార్యకర్తలందరు పాల్గొనాలని వారు పిలుపునిచ్చారు. ఈ సమా వేశంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల లింగారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇనుకొండ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు గాజుల స్వప్న, సాయిని మల్లేషం, జేరిపోతుల శంకర్, మీ డియా విభాగం జిల్లా కన్వీనర్ సుంకపాక విద్యాసాగర్, జిల్లా కార్యదర్శులు గంట సుశీల, గుర్రా ల వెంకట్ రెడ్డి, బిజెవైఎం రాష్ట్ర కార్యదర్శి బిట్టు, దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు జిడి సదయ్య, స్వచ్చ్ భారత్ జిల్లా కన్వీనర్ సర్ధార్ బల్బీర్ సింగ్, యువ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జు ంజిపల్లి వివేక్, గుడిపాటి జితేందర్ రెడ్డి, కాల్వ పూర్ణ చంద్ రెడ్డి, వడ్లురీ వెంకట్, అల్లురి శ్రీనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Comments

comments