Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

నిరాహార దీక్షకు దిగిన సంగీత

sgt

బోడుప్పల్ : తన అత్తింటి వారి  నుంచి న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ 51 రోజులుగా నిరసన చేపట్టిన పులకండ్ల సంగీత సోమవారం నాడు నిరహార దీక్షకు దిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న వంబర్ 19 నుంచి తనకు ,తన కు తూరుకు ఆత్మగౌరవంతో కూడిన న్యాయం కావాలని డిమాండ్ చేస్తూ శాంతి యుతంగా తన అత్తింటి ఎదుట దీక్ష చేస్తున్నాను. ఈ క్రమం లో నాకు మద్దతుగా వివిధ రాజకీయా పార్టీల నాయకులు, మహిళ సంఘాల నాయకులు మద్దతిచ్చారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరుపున తనకు మద్దతును ఇచ్చి నాయకులు న్యాయం చేస్తానని చెప్పిన మల్కాజిగిరి ఎంపి మల్లారెడ్డి ,నీకు నేనున్నాను అని భరోసా ఇచ్చిన స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో సహా అనేక మంది రాజకీయా నాయకులు ఇంత వరకు నాకు ఏలాంటి న్యాయం చేయలేదు. అందుకే నా నిర్ణయం మార్చుకున్నా నా ప్రణాలు పోయిన పర్వలేదు నా బిడ్డ భవిష్యత్ నాకు ముఖ్యం నా బిడ్డ కోసం నేను దేనికైన సిద్ధమేనని సంగీత తెలిపారు.  యాభై రోజులుగా నేను చలిగాలిలో చిన్న పాపతో ఇంటి ఎదుట కూర్చుని నిరసన కార్యక్రమం చేపట్టిన నాకు ఏలాంటి న్యాయం జరుగలేదు న్యాయం జరుగక పోగా నా అత్తింటిపై దౌర్జన్యం చేశానని నాపై తప్పుడు కేసులు పెట్టారు. ఇది న్యాయామా అని ప్రశ్నించింది. నాకు స్పష్టమైన హామీ వచ్చేంత వరకు నిరాహార దీక్ష కొనసాగిస్తానని తెలిపింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ సామాజిక ఉద్యమాకారిణి పి.దేవి, వి.సుర్యావాణి ,ఐద్వా మేడ్చల్ జిల్లా అధ్యక్షురాలు ఎన్.సృజన ,భాజపా మహిళ మోర్చా నాయకులు ఉల్ల గీతలు పాల్గొని సంగీతకు న్యాయం జరిగే వరకు పోరాటంలో పాలుపంచుకుంటామని తెలిపారు. ఈ సందర్భంగా నిరాహార దీక్ష చేస్తున్నా సంగీతకు ప్రైవేటు వైద్యుల చే పరీక్షలు నిర్వహించారు.

Comments

comments