Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

నగరానికి సంక్రాంతి ‘శోభ’

Sankrathi-image

మనతెలంగాణ/సిటీబ్యూరో: మకర సంక్రాంతి ఇది అందరి పండుగ.. యువతీ యువకుల సరదాలకు వేదిక… పండుగ సందర్భంగా యువకులు పతంగులు ఎగురవేస్తూ సంబురాల్లో మునిగిపోతే, యువతులు రంగురంగుల ముగ్గులు వేస్తూ లో గిళ్లకు కొత్త కాంతులను ఇస్తారు. ముంగిళ్లన్నీ ముత్యాల ము గ్గులతో వివిధ రకాల రంగులు నింపేస్తారు. ఈ పండుగ సందర్భంగా నగరంలోని పలు ప్రాంతాల్లో మహిళలు, యువతులు వివిధ రకాల ముగ్గులు వేస్తూ తమ సృజనాత్మకను చాటుకుంటున్నారు. ముగ్గంటే నాలుగు చుక్కలు కలపడమే కాదు నల బై భావాలను వ్యక్తం చేసే ఒక ప్రతిరూపమని చాటుతున్నా రు. తీరొక్క ముగ్గులు వేస్తూ ప్రతి ఒక్కరిని ఆలోచింపజేస్తున్నా రు. మనసులోకి ఆకాంక్షలకు, భావాలకు రంగులద్ది ముగ్గుల రూపంతో వ్యక్త పరుస్తున్నారు. ముగ్గంటే రమణీయమైన రం గులేకాదు. ఆ రంగులతో తమ భావాలు వ్యక్తం చేస్తున్నారు. యువతులు,వారి ఆశలు, ఆకాంక్షలు ఈ ముగ్గుల్లో స్పష్టంగా క నిపిస్తున్నాయి. ముగ్గంటే నేలమీద పేర్చిన చుక్కల్ని కలపడం కాదు. తలవాకిట తమ కోర్కెలు వ్యక్తపరిచే రంగుల మాలికా అంటున్నారు నేటి యు వతులు. సంకాంత్రి పండుగను పురస్కరించుకుని నగరంలో ని వివిధ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ముగ్గుల పోటీల్లో మహిళలు, యువతులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. మహిళలు, యువతులు తమ నైపుణ్యాన్నంతటిని రంగరించి రంగవల్లులను తీర్చిదిద్దుతున్నారు. ఈ ముగ్గులో సంక్రాంతి, భోగి పండుగల విశిష్టత, గ్రామీణ వాతావరణం, పాడిపంటలు త దితర అంశాలను చూపిస్తున్నారు. అలాగే బాలిక సంరక్షణ, బేటిపఢావో, బేటి బచావో,అవినీతిని వ్యతిరేకిస్తూ, మద్యపాన నిషేధం, తదితర అంశాలపై ముగ్గులను వేసి ప్రజల్లో సందేశాలను పంపుతూ మహిళా లోకం తమ ఆంకాక్షల్ని ఇలా వ్య క్తం చేస్తోంది. ముత్యాలముగ్గులో రంగులు పేర్చడమే కాదు ఆ రంగుల మధ్య ప్రమిదలు, పూర్ణకుంభాలు, గంగిరెద్దుల బొ మ్మలు, పూలు, ఫలాలు,ధ్యాన్యం మొక్కలు, ఆకులకు అమర్చి చూడముచ్చటగా తీర్చిదిద్దుతున్నారు.

సంక్రాంతి పండుగను పురస్కరించుకుని హైదరాబాద్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో మార్కెట్లలో రంగుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. ముగ్గులకు హంగులద్దడం కోసం మార్కెట్లలో 22 రకాల ఇంపోర్టెడ్ రంగులు ,బంగారు, వెండి రంగుల్లోని మెరుపులు, చమ్కీలు, పూలు, చెరకుగడలు ,బొ మ్మలు అందుబాటులో ఉన్నాయి. నగరంలోని బేగంబజార్, చుడీబజార్, చార్మినార్, గుల్జార్‌హౌస్ తదితర ప్రాంతాలలో రంగులు,మెరుపులు,చమ్కీలు ఎక్కువగా లభిస్తున్నాయి. అలా గే మార్కెట్లలో పంతంగులు, మాంజాల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.

Comments

comments