Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

గులాబీలో సీట్ల లొల్లి

trs2

*సర్వేలను నమ్ముకున్న నేతలు

*అంతర్గతంగా కొనసాగుతున్న పైరవీలు

*సిట్టిం గ్‌లకు సైతం సీటు బెంగ

*మెజార్టీ నియోజకవర్గాల్లో ఇద్దరికి మించి  ఆశావాహులు

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: వలసలతో ఓవర్‌లోడ్ అయిన అధికార పార్టీలో శాసనసభ సీట్ల కోసం నేతల మధ్య అంతర్గతంగా పోరు జోరుగా కొనసాగుతుంది. శాసససభ స్థానాల పెంపు ఖాయమన్న ఆశతో కాంగ్రెస్, టిడిపిలను వదిలి వలసవచ్చిన నేతలకు, గులాబీ జెండా నాటిన నుంచి జెండా మోసిన నేతలకు మధ్య మెజార్టీ నియోజకవర్గాల్లో సీట్ల లొల్లి నడుస్తుంది. గులాబీ రథసారధి కెసిఆర్ వరుస సర్వేలతో సిట్టింగ్‌ల పనితీరును బేరిజు వేయడంతో పాటు సిట్టింగ్‌ల దీటుగా నియోజకవర్గాల్లో విజయం సాధించే నేతల చిట్టాలను తయారు చేస్తుండడంతో సిట్టింగ్‌లలో సైతం టెన్షన్ పెరుగుతుంది. సంక్రాంతి పండుగ అనంతరం కెసిఆర్ తాజా గా చేయించిన మరో సర్వే బాగోతం ఎమ్మెల్యేలకు అందచేయనున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో శాసనసభ్యులు పూర్తిగా నియోజకవర్గాల్లో చక్కర్లు కొడుతున్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలోని 14 నియోజకవర్గాల్లో మెజారిటీ నియోజకవర్గాల్లో సీట్ల లొల్లి గత సంవత్సరకాలంగా కొనసాగుతుంది. అధికార పార్టీలో చివరివరకు టికెట్ కోసం ప్రయత్నించి సీటు దక్కకపోతే జంప్ కొట్టి మరో పార్టీ నుంచి బరిలో ఉండటానికి సైతం నేతలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దాదాపు పది నియోజకవర్గాల్లో ఇలాంటి నాయకులు కనిపిస్తుండగా కొంత మంది బిజెపితో పాటు అవసరమైన పక్షంలో టిడిపి నుంచి అయిన బరిలో నిల్చోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. తాము గెలవకపోయిన ఫర్వాలేదు తమకు సీటు రాకుండా చేసిన వారి ఓటమి లక్షంగా ఇతరులకు సహకరించాలన్న కసి సైతం కొంత మంది నేతల్లో కనిపిస్తుండటం విశేషం. సంక్రాంతి అనంతరం రాజకీయ వేడి మరింత పెరగనుండగా సీటు ఆశీస్తున్న నేతలు సైతం ఇక హల్‌చల్ చేయడానికి సిద్ధం అవుతున్నారు.
తాండూరు, పరిగి మినహ..
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో మంత్రి మహేందర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తాండూరు, మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్ రెడ్డి నియోజకవర్గం పరిగి మినహా మిగత అన్ని నియోజకవర్గాల్లో సీట్ల లొల్లి కనిపిస్తుంది. చేవెళ్ళ నియోజకవర్గంలో కాంగ్రెస్‌లో గెలిచి టిఆర్‌ఎస్‌లో చేరిన కాలే యాదయ్యకు, మాజీ ఎమ్మెల్యే కె.యస్.రత్నంకు సీటు పోరు సాగుతుంది. కాలే యాదయ్య మంత్రి మహేందర్ రెడ్డి అండదండలతో సీటు గ్యారంటీ అన్న ధీమాలో ఉండగా కాలే యాదయ్యను వికారాబాద్ నుంచి బరిలో దింపి తనకు చేవెళ్ళ సీటు ఇస్తారని మాజీ ఎమ్మెల్యే కె.యస్.రత్నం ధీమాతో తన పని తాను చేసుకుపోతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా రెండు గ్రూపులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాజేంద్రనగర్‌లో టిఆర్‌ఎస్ నుంచి 2014 ఎన్నికలలో పోటీచేసి ఓటమిపాలైన స్వర్ణలత రెడ్డితో పాటు టిడిపి నుంచి టిఆర్‌ఎస్‌లోకి వలస వచ్చిన ప్రకాష్‌గౌడ్‌తో పాటు శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్ సైతం సీటు ఆశీస్తున్నారు. కాంగ్రెస్ నుంచి టిఆర్‌ఎస్‌లోకి వచ్చి సీటు గ్యారంటీ లేక ఇప్పటికే బండ్లగూడ జ్ఞానేశ్వర్‌తో పాటు జైపాల్ రెడ్డిలో కాంగ్రెస్‌లోకి వెళ్లిపోయారు. సిట్టింగ్ ఎమ్మెల్యే తీగల క్రిష్ణారెడ్డితో పాటు గత ఎన్నికలలో పోచేసి పరాజయం పాలైన కొత్త మనోహర్‌రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరు నాయకులు సమాంతరంగా కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నారు.

ఇబ్రహింపట్నంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో పాటు గత ఎన్నికలలో పోటిచేసి పరాజయం పాలైన చంద్రశేఖర్ రెడ్డి, శేఖర్‌గౌడ్‌లతో పాటు ఇబ్రహింపట్నం ఎంపిపి నిరంజన్‌రెడ్డిలతో పాటు మరో సీనియర్ నేత టికెట్ ఆశిస్తున్నారు. ఇబ్రహింపట్నంలో ఆశావాహూల సంఖ్య రోజు రో జుకు పెరుగుతుంది. ఎల్.బి.నగర్‌లో గత ఎన్నికలలో పోటిచేసి పరాజయం పాలైన రామ్మోహన్ గౌడ్ తనకు టికెట్ గ్యారంటి అన్న దీమాలో ఉన్న ఇక్కడ నుంచి పోటిచేయడానికి నల్గొండ జిల్లాకు చెందిన ఇద్దరు బడానేతలు, కెసిఆర్ సన్నిహితులు సైతం ప్రయత్నాలు చే స్తుండగా పలువురు కార్పొరేటర్‌లు సైతం చాన్స్ ఇస్తే తాము సైతం సై అంటున్నారు. శేరిలింగంపల్లిలో సిట్టింగ్ అరికేపూడి గాంధీ కమ్మ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో సీటు గ్యారంటీ అని అనుకున్న ఇటివల తెలంగాణ కమ్మ సంఘం అం టు గాంధీ వ్యతిరేకులు కొత్త సంఘం ఏర్పాటు చేసి గాంధీకి షాక్ ఇచ్చారు. నియోజకవర్గంలో బండి రమే ష్, మువ్వ సత్యనారాయణలతో పాటు పలువురు కార్పొరేటర్‌లు టికెట్ ఆశీస్తున్నారు. పాలమూరు నుంచి రంగారెడ్డి జిల్లాలో కలసిన షాద్‌నగర్‌లో సిట్టిం గ్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్‌కు దీటుగా ఇటివల కాలంలో సీటు కోసం వీర్లపల్లి శంకర్ లాబీయింగ్ చేస్తున్నారు. అంజయ్య యాదవ్ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను నమ్ముకోగా వీర్లపల్లి శంకర్‌కు పాలమూరు మంత్రులు, ఎంపి జితేందర్ రెడ్డితో పాటు బడా పారిశ్రామీకవేత్త అండదండలు పుష్కలంగా ఉండటంతో సీటుపై ధీమాతో ఉన్నారు. కల్వకుర్తిలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ సీటు కోసం నువ్వా నేనా అన్న స్థాయిలో ప్రయత్నాలు చేస్తున్నారు. మేడ్చల్ సీటు కోసం ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పాటు నక్క ప్రభాకర్ గౌడ్ ప్రయత్నాలు చేస్తుండటంతో పాటు ఇతరులు సైతం ఆశలు పెట్టుకున్నారు. కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేలు వివేక్, మాదవరం క్రిష్ణారావులకు సీటు గ్యారంటీ అ యిన ఆశావాహూలు మాత్రం ప్రయత్నాలు చేస్తున్నా రు. కొడంగల్ నుంచి ఎమ్మెల్సీ నరెందర్ రెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డి టికెట్ ఆశిస్తున్నారు. ఉప ఎన్నికలు వస్తే నరెందర్ రెడ్డి టికెట్ గ్యారంటి అని సార్వత్రిక ఎన్నికలు వస్తే మాత్రం పరిణామాలు మారే అవకాశం ఉందని ప్రచారం జరుగుతుంది.
ఆ రెండు స్థానాల్లో: టిఆర్‌ఎస్ తరపున వికారాబాద్ నుంచి విజయం సాధించిన సంజీవరావు సీటు విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అనారోగ్యం సాకుతో సీటు ఇవ్వకుండా ఇతరులకు కట్టపెట్టనున్నారని ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్‌లో నుంచి మాజీమంత్రిని తీసుకువచ్చి టికెట్ ఇస్తారని….చేవెళ్ళ ఎమ్మె ల్యే కాలే యాదయ్యను ఇక్కడ నుంచి బరిలో దింపుతారని పూటకో ప్రచారం ఇక్కడ వినిపిస్తుంది. సంజీవరావుకు టికెట్ గ్యారంటీ అని సిఎం కెసిఆర్ మాత్రం బరోసా ఇచ్చారని ఆయన అభిమానులు నమ్మకంతో ఉన్నారు. ఎమ్మెల్యే కనకారెడ్డికి సీటు గ్యారంటీ లేదని ఇక్కడ నుంచి కొత్త వారికి అవకాశం దక్కవచ్చిన ప్రచారం జరుగుతుంది. ఎమ్మెల్సీ మైనంపల్లి, ఎంపి మల్లారెడ్డిలలో ఒకరు ఇక్కడ నుంచి పోటీచేసే అవకాశం ఉందని గులాబీ శ్రేణులలో ప్రచారం జరుగుతుంది.

Comments

comments