Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

ప్రైస్ వాటర్‌హౌస్‌పై సెబీ రెండేళ్ల నిషేధం

bsns2

ముంబై: సత్యం కంప్యూటర్ సర్వీస్ కుంభకోణంలో దోషిగా తేలడంతో ఆడిటర్‌గా వ్యవహరించిన ప్రైస్ వాటర్‌హౌస్(పిడబ్లూ)పై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రెండేళ్లపాటు నిషేధం విధించింది. ఆదేశాల ప్రకారం, దేశంలోని లిస్టెట్ కంపెనీల నుంచి ఈ ఆడిట్ సంస్థ రెండేళ్లు ఎలాంటి ఆడిట్ చేపట్టరాదు. 2017-18లో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకున్న సంస్థల ఆడిటింగ్‌ను మాత్రం పూర్తి చేయవచ్చు. తొమ్మిదేళ్ల క్రితం జరిగిన రూ.7,136 కోట్లు విలువైన సత్యం కుంభకోణంలో ఈ సంస్థ దోషిగా తేలింది. దీంతో సెబీ ఈ ఈమేరకు చర్యలు చేపట్టి.. 108పేజీల ఉత్తర్వులను జారీ చేసింది. అకౌంటింగ్ విలువలకు విరుద్ధంగా వ్యవహరించడంతో చర్యలు తీసుకున్నట్లు సెబీ పేర్కొంది. ఈ కంపెనీనికి చెందిన ఇద్దరు సీనియర్ భాగస్తులైన ఎస్.గోపాల కృష్ణన్, శ్రీనివాస్ తాళ్లూరిలు 2000-2008 మధ్యలో సత్యంకు తప్పుడు ఆడిట్ రిపోర్టులను ఇచ్చారని, దీనికోసం వారు ఆ సంస్థ నుంచి రూ.13కోట్ల మేరకు లబ్ధి పొందినట్లు తేలింది.  సెబీ ఆదేశాలపై ప్రైస్‌వాటర్ హౌస్  తమను తీవ్ర నిరాశ చెందింది. తమకు తెలియకుండా పదేళ్ల క్రితం జరిగిన మోసంతో శిక్ష విధించారని, ప్రైస్ వాటర్ హౌస్ సంస్థలు ఉద్దేశపూర్వకంగా ఏ తప్పు చేయలేదని పేర్కొంది. పైగా ఈ ఆదేశాలు ముంబై హైకోర్టు తీర్పునకు అనుకూలంగా లేవని స్పష్టం చేసింది.

Comments

comments