Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

ఆ ప్రభుత్వం తప్పులపైనే కోర్టులో కేసులు…

Shabbir-Ali

హైదరాబాద్: నూతన పంచాయతీరాజ్ చట్టం రూపకల్పనపై కెసిఆర్ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ….. టిఆర్‌ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో పంచాయతీలకు ఒక్కపైసా ఇవ్వలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం తప్పులు చేయడంతోనే కాంగ్రెస్ కోర్టుకు వెళ్లిందని, టిఆర్‌ఎస్ నాయకులకు గగ్గోలు పెట్టడం  అలవాటుగా మారిందని మండిపడ్డారు. తన స్థాయి వాళ్లు వస్తే విద్యుత్‌పై చర్చకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. ముఖ్యమంత్రి కెసిఆర్ పిలిస్తే విద్యుత్‌పై చర్చకు వెళ్లడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. జస్టిస్ చలమేశ్వర్ క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి అని పొగిడారు. చలమేశ్వర్ ఏదైనా లేవనెత్తితే అందులో వాస్తవం ఉంటుందని షబ్బీర్ స్పష్టం చేశారు.

Comments

comments