Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

‘జీరో’తో షారూఖ్ షాకిచ్చాడుగా..!(టీజర్)

Shah-Rukh-Khan

ముంబయి: బాలీవుడ్ ఖాన్ త్రయంలో ఒకరైన కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ నటిస్తున్న కొత్త చిత్రానికి ‘జీరో’ అనే టైటిల్ ఫిక్స్ చేసింది చిత్ర యూనిట్. బాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో షారూఖ్ మరుగుజ్జుగా నటిస్తున్నాడు. నూతన సంవత్సరం కానుకగా టైటిల్‌ ఫస్ట్ లుక్ తో పాటు టీజర్‌ను విడుదల చేశారు. పాతికేళ్ల తన సినీ కెరీర్‌లో ఖాన్ తొలిసారి మరుగుజ్జు పాత్రలో నటిస్తుండటం విశేషం. షారూఖ్‌కు జోడీగా అనుష్క శర్మ, కత్రినా కైఫ్ నటిస్తున్నారు. షారూఖ్ సతీమణి గౌరీ ఖాన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2018 డిసెంబర్ 21న మూవీ విడుదల కానుంది.

Shah Rukh Khan reveals upcoming film’s title as ‘Zero’.

Comments

comments