Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

‘సంస్థాగతం’పై పార్టీల చూపు

party* కార్యకర్తలతో మమేకమయ్యే ప్రణాళికలు
* ఇక పల్లెబాటకు పయనం
* చాప కింద నీరులా తీవ్రం
కానున్న ముందస్తు రాజకీయం

ఇక అన్ని రాజకీయ పార్టీలు సంస్థాగతంగా బలోపేతం అయ్యే కోణంలో ప్రణాళికలు రచిస్తున్నాయి. నవంబర్ మాసం తరువాత ఏ రోజైనా ఎన్నికలు జరగవచ్చన్న సంకేతాలు వెలువడుతుండడంతో పార్టీలన్నీ ముం దస్తుగానే అప్రమత్తం అవుతున్నాయి. అధికార టిఆర్‌ఎస్ పార్టీ ఓ అడుగు ముందుకేసి తన శ్రేణులందరినీ కార్యోన్ముఖులను చేసేందుకు సిద్ధమవుతుంది. అధినేత కెసిఆర్ ఇప్పటికే ఆయా నియోజకవర్గాల ఎంఎల్‌ఎలకు, మంత్రులకు హెచ్చరికలను జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇటీవల సిఎం తన సొంత వెబ్‌సైట్‌ల ద్వారా జరిపిన సర్వే ల నివేదికలను పరిగణలోకి తీసుకొని అప్రమత్త చర్యలను మొదలు పెట్టినట్లు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని పలు సెగ్మెంట్లలో అధికార టిఆర్‌ఎస్ పార్టీ పరిస్థితి వెనుకబడుతుండడాన్ని సిఎం సీరియస్‌గా తీసుకుంటున్నట్లు సమాచారం. తన సర్వే  ఫలితాల ఆధారంగా గ్రాఫ్ పడిపోయిన వారందరినీ ఆయన సీరియస్‌గానే హెచ్చరించి పరిస్థితిని మర్చుకోకుంటే పరిమణాలు తీవ్రంగా ఉంటాయని తాఖీదు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా కాంగ్రెస్ పార్టీ సైతం రాజకీయంగా అప్రమత్తమయ్యేందుకు సిద్దమవుతోందంటున్నారు. ఇప్పటికే ఆ పార్టీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి తనదైన శైలిలో పార్టీని పునరుత్తేజం చేసే కార్యాచరణ చేపట్టినట్లు పేర్కొంటున్నారు. నిరంతరంగా పార్టీ కార్యక్రమాలకు షెడ్యూల్ రూపొందిస్తూ మహేశ్వర్ రెడ్డి తన శ్రేణులకు ఉత్తేజితం చేస్తున్నారు. అలాగే బిజెపి సైతం తన వంతుగా పార్టీ కార్యక్రమాలను ప్రధాన పార్టీలకు ధీటైన రీతిలో చేపడుతూ దూసుకుపోయే ప్రయత్నాలు సాగిస్తుంది. ఇలా పోటాపోటీగా అన్ని పార్టీలు ఒకే సారి తన కార్యాకలాపాలను వేగవంతం చేయడంతో జిల్లాలో రాజకీయ పరిస్థితులు ఆసక్తిగా మారుతాయంటున్నారు.
పంచాయతీ ఎన్నికలలో సత్తా చాటే పార్టీలు వచ్చే సాధారణ ఎన్నికల నాటికి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉండడంతో అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అటు అధికార పార్టీతో పాటు ప్రతిపక్షాలు వదులుకోవడం లేదని అంటున్నారు. పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలతో అధికార పార్టీ ముమ్మర ప్రచారం చేపట్టాలని భావిస్తుండగా, ఎన్నికలలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం వైఫల్యం చెందిందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధం కావడం గమనార్హం.

Comments

comments