Search
Monday 23 April 2018
  • :
  • :

పార్టీ పటిష్టత వైపు టీఆర్‌ఎస్ …

trs

ప్రతిపక్షాలకు షాకిచ్చే రీతిలో కార్యకలాపాలు

ఆదిలాబాద్‌బ్యూరో: ఇప్పటివరకు అంతర్గత కార్యకలాపాలతో బిజీగా ఉంటూ జనానికి ఆశించిన మేరకు చేరువ కాలేకపో తున్న అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఇక వారి చెంతకు చేరే ప్రయత్నాలు మొదలు పెట్టబోతుంది. భారీ ఎత్తున అభివృద్ధి, సంక్షే మ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తున్నప్పటికీ పూర్తి స్థాయిలో క్రెడిట్ మాత్రం అధికార టీఆర్‌ఎస్ పార్టీకి దక్కడం లేదంటూ ఆ పార్టీ సీనియర్ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి తోడు పార్టీలో సీనియర్ నేతలు, కార్యకర్తల మధ్య సమ న్వయం లేకపోవడం సమిష్టిగా కార్యకలాపా లను చేపట్టడంలో విఫలమ వుతుండడంతో అధికార టీఆర్‌ఎస్‌పై ప్రజల్లో ఆశించిన మేరకు పాజిటివ్ దృక్ఫ థం ఏర్పడడం లేదంటున్నారు. ఇటీవల పలు ప్రైవేట్ సంస్థలే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆధీ నం లోని ఇంటలిజెన్స్ విభాగం జరిపిన సర్వేలో సైతం నెగెటివ్ రిపోర్టులు అందించడం ఆ పార్టీ అధి ష్టా నాన్ని ఆందో ళనకు గురి చేసిందంటున్నారు. ముఖ్యంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆ పార్టీ పది అసెంబ్లీ స్థానాలతో పాటు లోకసభ స్థానాలకు సైతం ప్రాతినిధ్యం వహి స్తుంది. అయితే చాలాచోట్ల ఎమ్మెల్యేలు సీనియర్ నాయకుల మధ్య సఖ్యత లేకపోవడంపార్టీ భవి ష్యత్ పై తీవ్రమైన ప్రభావం చూపే ప్రమాదం ఉం టుందని అంటున్నారు. అలాగే కొంతమంది ఎమ్మెల్యే లు, సీని యర్ నాయకులు సామాన్య కార్యకర్తలను నిర్లక్షం చేస్తుండడం, అలాగే నామినేటెడ్ పదవుల విషయం లోనూ ఆర్థిక పరమైన సహకారం విషయం లోనూ ఇప్పటికే ఆ పార్టీలో తీవ్ర మైన అసంతృప్తికి కారణమ వుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా, నియోజకవర్గాల పార్టీ కార్యవర్గాలను సైతం నియమించక పోవడం విమర్శలకు తావిస్తుంది. ఎమ్మెల్యేలే అన్ని తామై వ్యవహరిస్తుండడమే కాకుండా పార్టీ పరంగా కూడా వారే కీలక పాత్ర పోషిస్తుండడం సీనియర్లకు కంటగింపవుతుంది. ఇలాంటి నేపథ్యంలో ఇటీవల వెలువడిన పలు సర్వే నివేదికలు సైతం పార్టీకి వ్యతిరేకంగా వస్తుండడంతో అధిష్టానం ఆలస్యంగా నైనా మేల్కోబోతుందని అంటున్నారు. క్రమంగా ఎన్ని కలు సమీపించబోతుండడంతో అప్రమత్తం కాకపోతే అడ్రసు గల్లంతయినా ఆశ్చర్యపోనవసరం లేదన్న భావనలో టీఆర్‌ఎస్ నేతలున్నట్లు తెలుస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపధ్యంలో సీఎం ముందస్తుగానే అప్రమత్తమవుతూ ఇక పార్టీ కార్యకలాపాలను విస్తృ తం చేయాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. పార్టీపై చులకనగా మాట్లాడే వారు కాని, వ్యతిరేక కార్యకలా పాలు నిర్వహించే వారే కాని సీనియర్ నేతలను అవమానించడం, గౌరవించక పోవడం గాని జరిగితే ఇక అధిష్టానం చూస్తూ ఊరుకో బోదన్న సంకేతాలను నేతలు, శ్రేణులందరికీ అందించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో పార్టీ పరమైన కార్యక్రమాలను గ్రామ గ్రామాన నిర్వహించి ప్రజలకు మరింత చేరువ కావాలన్నదే అధిష్టానం నిర్ణయంగా చెబుతున్నారు. ఓవైపు ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్థి, సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా ప్రచారం చేయడం, మరోవైపు పార్టీ కార్యక్రమాలను ముమ్మరంగా చేపట్టి జనంతో మమేకం కావాలని అధిష్టానం భావిస్తుంది. కొద్ది రోజుల్లోనే పార్టీకి సంబంధించిన ప్రచార కార్యక్రమాలపై షెడ్యూల్‌ను కూడా ఖరారు చేయాలని నిర్ణయించారు. కార్యకర్తల సమావేశాలు, ఇతర పార్టీ పరమైన కార్యక్రమాలను ఇక నిరంతరాయంగా చేపట్టి జనం చెంతకు చేరువ కావాలన్నదే ఆ పార్టీ నిర్ణయంగా చెబుతున్నారు.

Comments

comments