Search
Friday 20 April 2018
  • :
  • :

వ్యాపార వర్గాలకు సింగరేణి కరెంటు నిలిపివేత

knr

మండిపడిన వ్యాపారులు…జిఎం కార్యాలయం ముట్టడి
బాసటగా నిలిచిన డిప్యూటీ మేయర్, కార్పొరేటర్లు
నెలరోజుల గడువుకు అనుమతి
యైటింక్లయిన్‌కాలనీ: సింగరేణి సంస్థకు చెందిన కరెం టును రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 8వ కాలనీకి చెందిన వ్యాపా ర సంస్థలకు సోమవారం నిలిపివేశారు. కరెంటు సరఫరా నిలిపివేతపై వ్యాపారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.మూకుమ్మడిగా ఆర్‌జి-2 జిఎం కార్యాలయానికి తరలివెళ్లి ముట్టడించారు. వ్యాపారులకు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్,కార్పొరేటర్లు మందల కిషన్‌రెడ్డి, స్టాలి న్‌గౌడ్, సర్పంచ్ చాట్ల సదానందం బాసటగా నిలిచారు. దిగివచ్చిన యా జమాన్యం ఒక నెల రోజుల గడువుకు అనుమతి ఇవ్వడంతో వ్యాపారు లు శాంతించి నిరసనను విరమించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. 8వ కాలనీలోని వ్యాపార సంస్థలకు సింగరేణి యాజమాన్యమే కరెంటు సర ఫరా చేస్తుంది. దీనికి తెలంగాణ ట్రాన్స్‌కో అభ్యంతరం తెలిపింది. తమ వద్ద తక్కువ ధరలకు కరెంటు కొనుగోలు చేసి వ్యాపారులకు ఇవ్వడం సరికాదంటూ పలు దఫాలు లేఖలు జారీ చేసింది. సింగరేణి కరెంటు పే రిట వ్యా పారం చేయడం సరికాదని ఆరోపించింది. సంవత్సరానికి మూ డు కోట్ల చొప్పున జరిమానా విధిస్తుంది. వ్యాపారులకు కరెంటు సరఫరా ఆపివేయాలని సింగరేణి కార్పొరేట్ నుంచి ఉత్తర్వులు వెలువెడ్డాయి. వ్యా పారులకు కరెంట్ సరఫరా చేయాలని ట్రాన్స్‌కో ను కోరింది. ఈ మేరకు స్పందించిన ట్రాన్స్‌కో కాలనీలో విద్యుత్తు సరఫరా కోసం ప్రత్యేకంగా లైన్లు వేసింది. సింగరేణి యాజమాన్యం నెల రోజుల కిందటే 8వ కాల నీలోని వ్యాపారులకు ప్రభుత్వ మీటర్లకు దరఖాస్తు చేసుకోవాలని, సింగ రేణి కరెంటు ఉపసంహరించుకుంటున్నట్టు నోటీసులు జారీ చేసింది. కా నీ వ్యాపారులు ప్రభుత్వానికి చెందిన మీటర్లకు ఏ ఒక్క వ్యాపారి దరఖా స్తు చేసుకోలేదు. వ్యాపారుల నుంచి స్పందన రాకపోవడంతో ఆగ్రహించి న సింగరేణి సోమవారం అన్ని రకాల వ్యాపార సంస్థల కరెంటు సరఫరా ను నిలిపివేసింది. దీంతో ఆగ్రహం చెందిన వ్యాపారులు తాము సింగరేణి పవర్ కోసం 2500 రూపాయల డిపాజిట్ చెల్లించామని, దీని సంగతి ఏ మిటని ప్రశ్నించారు.అలాగే కాలనీలో వేయికి పైగా వ్యాపారులు ఉన్నా రని, ఒకే దఫా మీటర్లు ఎలా ఇస్తారని ప్రశ్నించారు.గేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. ఎస్‌ఒటుజిఎం కె.రవీందర్, ఏరియా వర్క్‌షాప్ డిజిఎం ఎర్రన్న,ఎస్‌ఇ రాంరెడ్డితో చర్చలు జరిపారు. డి పాజిట్ చేసిన 2500 రూ పాయల విషయం కార్పొరేట్‌కు రాసి పంపిస్తామని, అక్కడి నుంచి ఎలా వస్తే అలా స్పందిస్తామని సింగరేణి అధికారులు వ్యాపారులకు హామీ ఇ చ్చారు. మంగళవారం ట్రాన్స్‌కోకు చెందిన అధికారులతో సమావేశం ఏ ర్పాటు చేస్తామని వ్యాపారులకు హామీ ఇచ్చారు. నెల రోజుల వరకు క రెంటు సరఫరా చేయడానికి సింగరేణి అధికారులు అంగీకరించారు. కా నీ నెల రోజుల్లో ప్రతి వ్యాపారి ప్రభుత్వ మీటర్‌కు దరఖాస్తు చేసుకోవా లని కోరారు. దీనికి వ్యాపారులు అంగీకరించారు. దీంతో మూడు గంట ల పాటు సాగిన నిరసన ఎట్టకేలకు ముగిసింది. సమావేశంలో వ్యాపార సంఘ నాయకులు బెల్లంకొండ విజేందర్‌రెడ్డి, కండెం సురేష్, సంపత్, బుర్రముత్యాలుగౌడ్,చంద్రమౌళి, తదితరులు పాల్గొన్నారు.

Comments

comments