Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

రెండు వాహనాలు ఢీ : ఆరుగురు మృతి

ACCIDENT

ముంబయి : మహారాష్ట్రలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. సంగ్లీ జిల్లా కొడెగావ్‌లో ఎదురెదురుగా వచ్చిన రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఘటనాస్థలిలో పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఓ వాహనం నుజ్జు నుజ్జు అయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు.

Six People died in Road Accident in Sangli district

Comments

comments