Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

దక్షిణాఫ్రికా 269/6.. అశ్విన్ 3

india
సెంచూరియన్: భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో టెస్టులో భాగంగా సఫారి జట్టు తొలి ఇన్నింగ్స్‌లో మెదటి రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. ఓపెనర్ మార్క్రమ్ 94, హషీమ్ ఆమ్లా 82 అర్థ సెంచరీలతో రాణించారు. ఎల్గర్(31), ఎబి డివిలియర్స్(20) తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చెరారు. డికాక్ (0) డకౌట్ అయ్యడు. డిప్లెసిస్ (24 బ్యాటింగ్), కేశవ్ మహరాజ్(10 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లల్లో అశ్విన్ మూడు వికెట్లతో రాణించాడు. ఇషాంత్ శర్మకు ఒక వికెట్ దక్కగా, రనౌట్ల రూపంలో మరో రెండు వికెట్లు వచ్చాయి.

Comments

comments