Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్-335

India-vs-South-Africa

సెంచూరియన్: దక్షిణాఫ్రికా- భారత్ మధ్య జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో సౌతాఫ్రికా 335 పరుగులు చేసి ఆలౌటైంది. తొలి రోజు సఫారీలు ఆరు వికెట్ల నష్టానికి 269 పరుగులు చేసింది. రెండో రోజు 66 పరుగులు జోడించి నాలుగు వికెట్లు కోల్పోయింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్లలో ఎడిన్ మార్ క్రమ్ (94), హషీమ్ అమ్లా (82), డూప్లిసెస్ (63), డీన్ ఎల్గర్ (31), డివిలయర్స్ (20), కేశవ్ మహారాజ్ (18), రబడ(11), మిగతా వారు సింగిల్ డిజిటికే పరిమితమయ్యారు.  భారత్ బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ నాలుగు వికెట్లు తీయగా ఇశాంత్ శర్మ మూడు వికెట్లు, మహ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఇద్దరు రనౌట్ రూపంలో ఔటయ్యారు. భారత్ తొలి ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. ప్రస్తుతం క్రీజులో మురళీ విజయ్ (4), లోకేశ్ రాహుల్ (0)లు ఉన్నారు.

Comments

comments