Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

కేప్‌టౌన్ టెస్ట్‌: టీమిండియా పరాజయం

Murali-Vijay

కేప్‌టౌన్: వేదికగా భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరిగిన తొలి టెస్టులో కోహ్లీసేన 72 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 208 పరుగుల లక్ష్య చేధనతో బరిలోకి దిగిన భారత్ 135 పరగులకే కుప్పకూలింది. ఆతిథ్య జట్టు బౌలర్లు విజృంభించడంతో భారత బ్యాట్స్‌మెన్లు చెతులెత్తేశారు. టీమిండియా బ్యాట్స్‌మెన్లలో అశ్విన్(37), కోహ్లీ(28), శిఖర్ ధావన్(16), మురళి విజయ్(13) పరుగులు చేయగా మితవారు పెవిలియన్‌కు క్యూకట్టారు. చివరలో అశ్విన్, భువనేశ్వర్ ఆశలురేపారు. ఎనిమిదో వికెట్‌కు ఈ ద్వయం 49 పరుగుల భాగస్వామ్యం అందించింది. అశ్విన్ నిష్క్రమణతో భారత్ పరాజయం ఖాయమైంది. దక్షిణాఫ్రికాల బౌలర్లలో ఫిలాండర్ 6, మొర్కెల్, రబడా చెరో 2 వికెట్లు తీశారు. ఈ విజయంతో ఆతిథ్య సఫారీ జట్టు మూడు టెస్టు మ్యాచుల సిరీస్ లో 1-0 తేడాతో ఆధిక్యంలో నిలిచింది.

స్కోర్ వివరాలు: దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్- 286, రెండో ఇన్నింగ్స్- 130

                          భారత్  తొలి ఇన్నింగ్స్- 209, రెండో ఇన్నింగ్స్- 135

South Africa won by 72 runs.

Comments

comments