Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

ఆయన దగ్గర విషయాలు నేర్చుకున్నా

natasha

నందమూరి బాలకృష్ణ హీరోగా కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ నిర్మించిన చిత్రం ‘జై సింహా’. ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ  హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమా శుక్రవారం విడుదలకానుంది. ఈ సందర్భంగా నటాషా దోషితో ఇంటర్వూ విశేషాలు.. 

 తెలుగులో మొదటిది…
మలయాళంలో రెండు చిత్రాల్లో నటించాను. అక్కడ నా మొదటి సినిమా ‘మంత్రికన్’. హీరో జయరాంతో కలిసి నటించాను. మా అమ్మ మలయాళీ కాబట్టి నాకు మలయాళం బాగా వస్తుంది. ఇక నా తొలి తెలుగు చిత్రం ‘జై సింహా’.

 యువరాణిలా చూసుకుంటారు…
ఈ సినిమాలో నా పాత్ర పేరు ధన్య. మురళీమోహన్‌కు కూతురిగా నటించాను. ఆయన నన్ను యువరాణిలా చూసుకుంటారు. మా నాన్న యుఎస్ నుండి స్వస్థలం కుంభకోణం వచ్చాక ఏం జరిగింది అనేది ఈ చిత్రంలో ఆసక్తికరంగా ఉంటుంది.

 అదృష్టంగా భావిస్తున్నా…
దర్శకుడు కె.ఎస్.రవికుమార్, నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్రంలోని పాత్ర కోసం నన్ను సంప్రదించారు. చాలా మంది అమ్మాయిలను చూశాక వాళ్లు నన్ను ఎంపికచేశారు. ఈ పాత్ర చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

 సులభంగా చేశాను…
సినిమాలోని అమ్మకుట్టి… పాటలో నా డ్యాన్స్ ప్రేక్షకులను అలరిస్తుంది. నేను బేసిక్‌గా డ్యాన్సర్ కావడంతో ఎంతో సులభంగా ఈ పాటలో డ్యాన్స్ చేశాను. స్క్రీన్‌పై నా నటన అందరికీ నచ్చుతుందన్న నమ్మకముంది.

 ఆయన గొప్ప నటుడు…
బాలకృష్ణ తెలుగు సినిమాలు చూడలేదు కానీ ఆయన సినిమాలు హిందీలో డబ్ అయ్యాకు వాటిని చూశాను. ఆయన గొప్ప నటుడు. బాలకృష్ణతో కలిసి నటించడం మరచిపోలేని అనుభూతినిచ్చింది. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను.

 ఆతృతగా ఎదురుచూస్తున్నా…

దర్శకుడు రవికుమార్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు చాలా నచ్చింది. ఆయన చెప్పిన విధానం, కథలో ట్విస్ట్ నన్ను ఈ సినిమాలో నటించేలా చేశాయి. ‘జై సింహా’ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.

Comments

comments