Search
Wednesday 24 January 2018
  • :
  • :
Latest News

గిరిజన అభ్యర్థులకు ప్రత్యేక శిక్షణ

POLICE

*ఎస్‌పి విష్ణు ఎస్ వారియర్

మన తెలంగాణ/ ఆదిలాబాద్   డివిజన్ పరిధిలోని మారుమూల గిరిజన గ్రామాల్లోని నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు మెరుగుపర్చడంలో భాగంగా ఉచిత శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేస్తామని జిల్లా ఎస్‌పి విష్ణు ఎస్ వారియర్ తెలిపారు. మంగళవారం స్థానిక పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వివరాలను వెల్లడించారు. సామాజిక సేవ కార్యక్రమంలో భాగంగా గ్రామాల్లోని యువకులను ఉపాధి వైపు మళ్లించేందుకు పోలీస్ శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఇటీవల జిల్లాలో పర్యటించిన డిజిపి మహేందర్‌రెడ్డి ఆదేశాలకు అనుగుణంగా ఉచిత శిబిరాలకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. గిరిజన గ్రామాల్లో అనేక మంది ఉన్నత చదువులను అభ్యసించిన వారు ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం లేదని, ఈ అంశాలపై కసరత్తు చేసి ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపికయ్యేందుకు కావాల్సిన నైపుణ్యతను పెంపొందించేందుకు పోలీస్ శాఖ చర్యలు తీసుకుంటుందని అన్నారు. పోలీస్ శాఖ ప్రక్షాళనలో భాగంగా అదనపు ఎస్‌పిలు, డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలకు పదోన్నతులకు కల్పించంతో భారీగా కానిస్టేబుల్ ఖాళీలు ఏర్పడనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యోగాలకు జిల్లా నుంచి ప్రధానంగా గిరిజన గ్రామాల నుంచి యువతి, యువకులను ఎంపిక చేసి హైద్రాబాద్ స్థాయిలో ప్రత్యేక నిపుణులచే ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమ పేర్లను పోలీస్ స్టేషన్లలో నమోదు చేసుకోవాలని సూచించారు.

Comments

comments