Search
Saturday 21 April 2018
  • :
  • :

ఎట్టకేలకు ఓకే

ravi

ఒకప్పుడు స్టార్ డైరెక్టర్‌గా ఓ వెలుగు వెలిగిన దర్శకుడు శ్రీనువైట్ల కొంతకాలంగా వరుసగా పరాజయాలతో డీలాపడిపోయాడు. మహేష్‌బాబుతో చేసిన ‘ఆగడు’, రామ్‌చరణ్‌తో చేసిన ‘బ్రూస్‌లీ’ సినిమాలు అతనికి నిరాశనే మిగిల్చాయి. ఆతర్వాత యంగ్ హీరో వరుణ్‌తేజ్‌తో చేసిన ‘మిస్టర్’ కూడా పరాజయాన్ని అందుకుంది. దీంతో శ్రీనువైట్ల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. అయితే అతను రవితేజతో ఓ సినిమా చేయబోతున్నాడనే టాక్ కొంతకాలం నుంచి వినిపిస్తోంది. బోయపాటి శ్రీను చెప్పిన స్టోరీ లైన్‌కు రవితేజ ఓకే చెప్పాడని సమాచారం. దీంతో పూర్తి స్క్రిప్ట్‌ను సిద్ధం చేసుకునే పనిలో అతను ఉన్నట్లు తెలిసింది. అయితే ఈ చిత్రంలో ఎన్‌ఆర్‌ఐ పాత్రలో రవితేజ కనిపించనున్నట్లు తెలిసింది. రవితేజ మార్క్ మాస్ ఎలిమెంట్స్, శ్రీను వైట్ల స్టైల్ కామెడీకి ఈ చిత్రంలో లోటు ఉండదని అంటున్నారు. అయితే ఎన్‌ఆర్‌ఐ మాస్ ప్లస్ కామెడీ… ఇవన్నీ చూస్తుంటే మళ్లీ ఈ దర్శకుడు తన పాత స్టైల్ కథనే సిద్ధం చేసుకుంటున్నాడని అనిపించక మానదు. అయితే ఈ సినిమాలో శ్రీనువైట్ల కొత్త స్క్రీన్‌ప్లేను చూపిస్తాడా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. ప్రస్తుతం కళ్యాణ్‌కృష్ణతో మూవీని ప్రారంభించిన రవితేజ అది పూర్తికాగానే శ్రీనువైట్ల సినిమాను పట్టాలెక్కిస్తాడు.

Comments

comments