Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

తల్లకిందుల శిక్ష

students-panishment

అల్లరి చేశారని విద్యార్థుల చేత శీర్షాసనం వేయించిన జహీరాబాద్ ఎస్‌టి హాస్టల్ వార్డెన్  స్వయంగా వచ్చి వివరాలు తెలుసుకున్న పై అధికారులు

మన తెలంగాణ/ జహీరాబాద్ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఎస్‌టి వసతి గృహం వార్డెన్ విద్యార్థుల చేత శీర్షాసనం వేయించి తల్లకిందుల జపం చేయిస్తున్నాడు. ఈ వసతి గృ హంలో వివిధ పాంతాలకు చెందిన 250 మంది విద్యార్థులున్నా రు. మండలంలోని శేకాపూర్ గ్రామానికి తల్లకిందుల శిక్ష చెందిన పరమేశ్వర్, లక్ష్మణ్‌లు వసతి గృహం లో ఉంటూ 7వ తరగతి చదువుతున్నారు. ఈ ఇద్దరూ అల్లరి చేశారని వార్డెన్ తల్లకిందులుగా నిల్చోబెట్టి కఠినంగా శిక్షించాడు. ఈ విషయం గురించి పట్టణంలో అదే పనిగా చర్చించుకుంటున్నారు. విద్యార్థులు తప్పు చేస్తే శిక్షించడం సరైందే కానీ, ఇంత దారుణంగా చేయడం పద్ధతి కాదని భావిస్తున్నారు. విద్యార్థులను వార్డెన్ శిక్షించిన విషయం ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో సోమవారం ఆర్‌డిఒ, జిల్లా ట్రైబల్ అధికారిణి మాణమ్మలు వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థుల నుంచి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు.

Comments

comments