Search
Saturday 21 April 2018
  • :
  • :

సంస్కృతీ సంప్రదాయాల మేళవింపు కంబోడియా

Temple-image

ఆగ్నేయాసియా దేశమైన కంబోడియాను పూర్వం కంపూచియాగానూ, కాంభోజ రాజ్యంగానూ పిలిచే వారు.  కంబోడియా రాజధాని ఫునమ్ ఫెన్. కరెన్సీ కంబోడియన్ రియాల్స్ కానీ కంబోడి యాలో ని లావాదేవీలన్నీ అమెరికన్ డాలర్లలోనే జరుగుతాయి. స్థానిక కరెన్సీని ఎవరూ ఎక్కువగా వాడరు. అధికారిక భాష ఖ్మేర్.  మతం ‘ తెరవాడ బౌద్ధమతం‘. ఈ మతాన్ని దేశ జనాభాలో 95% ప్రజలు అనుసరిస్తున్నారు. దేశంలోని అల్పసంఖ్యాకులు వియత్నామీయులు, చైనీయులు, చాములు, 30 రకాల గిరిజనులు మొదలైనవారు. దేశరాజధాని, దేశంలోని అతి పెద్ద నగరమైన ‘ నాంఫెన్‘ కంబో డియా సాంస్కృతిక, రాజకీయ, ఆర్థిక కేంద్రమని చెప్పవచ్చు. రాచరిక విధానాన్ని అనుసరిస్తున్న దేశమిది.

భారతదేశంతో అవినాభావ సంబంధం: పూర్వం కాంభోజ దేశంలో హిందూ సంస్కృతే ఎక్కువగా ఉండేది. 9-15 శతాబ్దాల కాలంలో ఈ దేవాలయాన్ని నిర్మించిన రెండవ సూర్యవర్మతో పాటు అనేక మంది హిందూ రాజులు కంపూచియాను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. చైనా రికార్డుల ప్రకారం ఈ ప్రాంతమంతా భరత ఖండానికి చెందిన రాజుల పాలనలో ఉండేది. భారతీయ పురాతన సంస్కృత గ్రంథాలు కూడా ఈ విషయాన్ని రూఢి చేస్తున్నాయి. చోళ రాజ్యానికి చెందిన ఒక రాజు, టోనెల్ సాప్ నదీ పరీవాహక ప్రాంతాన్ని ఏలుతున్న ’నాగ’ అనే రాకుమార్తెను వివాహం చేసుకుని ఇక్కడ రాజ్యాన్ని ఏర్పాటు చేసినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఖ్మేర్ నాగరికత తర్వాత కొన్ని శతాబ్దాల అనంతరం భారతీయ సంస్కృతి కంపూచియాకు వ్యాపించింది. సంస్కృతం అధికార భాషగా హిందూ, బౌద్ధమతాలు అధికార సంప్రదాయాలుగా వెలుగొం దాయి. సం స్కృ తీ సంప్రదాయాలకూ ఆచార వ్యవహారాలకూ నిలు వెత్తు నిదర్శనంగా నిలిచే చూడచక్కని పట్టణమే సియాంరీప్. ఇప్పటికీ దీని చుట్టుపక్కల గ్రామాల్లో సందర్శకుల కోసం ప్రాచీన ఖ్మేర్ సా మ్రాజ్య కాలం నాటి చెక్క ఇళ్లను యథాతథంగా పరిరక్షిస్తు న్నారు.

అంగ్ కోర్ వాట్ ఆలయం: జీవిత కాలంలో కనీసం ఒక్కసారైనా దర్శించాలనుకునే పర్యాటక ప్రాంతాల్లో ఆంగ్‌కోర్ వాట్ దేవాలయం ఒకటి. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఈ ప్రాచీన విష్ణుదేవాలయం యునెస్కో వారిచే ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందింది. 12వ శతాబ్దంలో సూర్యవర్మన్ 2 దీనిని నిర్మించారు. ఇది ఖ్మేర్ నిర్మాణ శైలిలో నిర్మించారు. కంబోడియాలోని సీమ్ రీప్ పట్టణానికి సుమారు ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది. కంబోడియా జాతీయ పతాకంలో కూడా ఈ ఆలయం స్థానం సంపాదించుకుంది. తమిళనాడుకు చెందిన చోళరాజుల నిర్మాణ పద్ధతులు ఈ దేవాలయాల్లో కనిపిస్తాయి. దేవాలయాలన్నీ మిగతా వాటికి భిన్నంగా పశ్చిమ ముఖద్వారాన్ని కలిగి ఉన్నాయి. టోనెల్ సాస్ సరస్సు తీరాన సుమారు 200 చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగి ఎంతో విశాలమైన ప్రాంగణంలో ఎన్నో దేవాలయాల సముదాయంతో ఆహ్లాద భరితంగా ఉంటుంది. ప్రస్తుతం ఇది బౌద్ధ దేవాలయంగా మార్పు చెందినది.

ఇంజనీర్ల నైపుణ్యత : ఖ్మేర్ సామ్రాజ్యంలో నీటిని నిల్వ చేసుకు నేందుకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయో గించారు. ఇక్కడి నీరు పల్లం నుండి ఎత్తుకు ప్రవహిం చేదట. అదే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆంగ్‌కోర్ వాట్ దేవాల యంలో కూడా వాడారు. ఇది అప్పట్లోనే ఎలా సాధ్యమ యింaదనే విషయం అందర్నీ ఆశ్చ ర్యపరుస్తుంది. ఐదు మైళ్ల పొడవు, ఒకటిన్నర మైలు వెడల్పుతో విశా లమైన రిజర్వాయర్లు (వీటిని అక్కడ ’బారే’లు అంటారు) నిర్మించడం ఆనాటి ఇంజనీర్ల ప్రతిభకు నిదర్శనం. ఈ రిజర్వాయర్లను వ్యవసాయ అవసరాలకు కూడా ఉపయోగిం చేవా రట. ఫ్రెంచ్ ఆర్కియా లజిస్ట్ ఫిలిప్ గ్లోసియర్ ఈ రిజర్వాయర్లపై పరిశోధన జరిపి ఈ విషయాన్ని ధృవపరిచాడు. నాసా చిత్రీకరించిన ఉపగ్రహ చిత్రాల ఆధారంగా పరిశోధనలు జరిపిన సిడ్నీ యూనివర్శిటీ ఆర్కియాలజిస్టుల పరిశోధన కూడా ఫిలిప్స్ అభిప్రాయాన్ని బలపరుస్తోంది. ఉపగ్రహ చిత్రాల్లో అప్పటి మానవ నిర్మితమైన నీటి ట్యాంకులు, కాలువలు, డ్యాములు స్పష్టంగా కనిపించాయట.

బ్యాస్ – రిలీఫ్స్ గ్యాలరీ: ఈ దేవాలయంలో మరో అద్భుతమైన ప్రదేశం బ్యాస్ – రిలీఫ్స్ గ్యాలరీ. నాలుగు గోడలతో నిర్మించిన ఈ మండపంలో ఎక్కడ చూసినా హిందూ పురాణ గాథలే కనిపిస్తాయి. తూర్పున ఉన్న ’మంటన్’ అనే గ్యాలరీ అందర్నీ ఆకట్టుకుంటుంది. భారత పురాణాలైన రామాయణ, మహా భారత దృశ్యాలు అనేకం ఇక్కడ మనకు సాక్షాత్కరిస్తాయి. దేవతలూ, రాక్షసుల మధ్య జరిగిన క్షీరసాగర మధన దృశ్యాలు అందర్నీ ఆకట్టుకుంటాయి. తూర్పు వైపు మండపంలో విష్ణుమూర్తి పుట్టుక, అవతారాలకు సంబంధించిన శిల్పాలు ఉంటే పశ్చిమం వైపు మండపం గోడలపై యుద్ధాలు, మరణాలకు సంబంధించిన ఆకృతులు కనిపిస్తాయి. కురుక్షేత్ర యుద్ధం, రామ రావణ యుద్ధ సంఘటనలు ఎంతో చక్కగా మలచబడ్డాయి. ఇక దక్షిణ మండ పంలో ఆలయాన్ని నిర్మించిన రాజు రెండవ సూర్య వర్మన్ రాజ్యానికి సంబంధించిన సైనిక పటాల దృశ్యా లు దర్శనమిస్తాయి. ఇవే కాక పురాణ పురుషులు, మునులు, కిన్నెర, కింపురుష, అప్సరసల నాట్య విన్యాసాలు, యమధర్మరాజు కొలువుదీరిన యమసభ వంటి అనేక కళాఖండాలు ఆంగ్‌కోర్ వాట్ ఆలయ గోడలపై సాక్షాత్కరిస్తాయి.

కాంభోజ దేశం : భారతీయ సంస్కృతి ఆనవాళ్లే లేని కంపూచియాలో ఇంతపెద్ద హిందూ దేవాలయాన్ని ఎలా? ఎందుకు? నిర్మించారనే సందేహం కలుగు తుంది? ప్రస్తుతం కంపూచియాగా పిలవబడే ఈ దేశా న్ని పూర్వకాలంలో ’కాంభోజ దేశం’ అని పిలిచేవారు. సంస్కృత పదాలను సరిగ్గా ఉచ్ఛరించలేని యూరో పియన్లు, కాంభోజ దేశాన్ని కంబోడియాగా మార్చే శారు. యూరోపియన్ వలస దేశాల అజమాయిషీలోకి వెళ్లిన తర్వాత కాంభోజదేశం కాలక్రమంలో కంపూచి యాగా మారిపోయింది.

ఆంగ్‌కోర్ థోమ్ :ఆంగ్‌కోర్ వాట్ దేవాలయానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో అద్భుత ప్రదేశం ఆంగ్‌కోర్ థోమ్. ఖ్మేర్ సామ్రాజ్యంలోని చివరి చక్రవర్తుల్లో ఒకరైన ’జయవర్మ – 6 ఆంగ్‌కోర్ థోమ్‌ను రాజధానిగా చేసు కుని రాజ్యాధికారం చేపట్టాడనడానికి చారి త్రక ఆధారాలున్నాయి. దీనినే ’మహానగరం’ అని కూడా అంటారు. తొమ్మిది చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ దేవాలయ నిర్మాణం జరిగింది. ఇక్కడ కూడా అనేక పురాణ కళా కృతులు మనకు దర్శనమిస్తాయి. ఇక్కడ బౌద్ధ మత సంస్కృతి ఎక్కువగా ఉంది. ఏనుగుల మిద్దె లు, లెపర్ రాజు ప్రతిమలు, బెయాన్, బఫూన్ లాంటి అనేక నిర్మాణాలు ఇక్కడి ప్రత్యేకత. ఆంగ్‌కోర్ థోమ్ మధ్యలో చిన్న చిన్న మిద్దెలతో నిర్మించిన గోర్డెన్ టవర్ (బెయాన్) ఆకర్షణీ యంగా ఉంటుంది. 54 అంతస్తులతో నిర్మించిన బెయాన్ (బుద్ధుని) దేవాలయం ఆంగ్‌కోర్ థోమ్‌కి ఆకర్షణీయంగా నిలుస్తుంది
బాంటే స్రెయ్: సియాంరీప్ నుంచి 30 కి.మీ దూరంలో బాంటే స్రెయ్ ఆల యానికి ఉంది. అంకోర్‌వాట్ కన్నా ముందే పదో శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయంలోని శిల్పకళ కూడా చూపరులను కట్టిపడేస్తుంది. ఇక్కడికి దగ్గరలోనే ప్రేరుప్ అనే ప్రదేశం ఉంది. అక్కడి సూర్యా స్తమయ సౌందర్యాన్ని చూసి తీరాల్సిం దే.

కులెన్ జాతీయ ఉద్యానవనం: ఇక్కడికి 60 కి.మీ.దూరంలో అభయారణ్యం ఉంది. దీన్ని కులెన్ జాతీయ ఉద్యానవనంగా పిలుస్తారు. ఆ మార్గం పచ్చని చెట్లతో ఆహ్లాదభరితంగా కనువిందు చేస్తుంటుంది. ఇక్కడ శయనభంగిమలోని బుద్ధుని విగ్రహం ఆకట్టుకుంటుంది. అక్కడకు దగ్గరలోనే ఉన్న నదిలో వేయి శివలింగాలు ఉన్నాయి.

ఫునమ్ ఫెన్ – కంబోడియా రాజధాని: సియాం రీప్ విమానంలో వెళితే గంటన్నర ప్రయాణం కాంబోడియా రాజధాని ఫునమ్. రాయల్ ప్యాలెస్, సిల్వర్ పగోడా చూడదగ్గ విశేషాలు. అక్కడే ఉన్న జాతీయ మ్యూజియంలో కంబోడియా దేశ పురాతన శిల్పకళాఖండాలను చూడవచ్చు. ఈ ప్రదర్శనశాలను ఎంతో చక్కగా తీర్చిదిద్దారు. దగ్గరలో మేకాంగ్ నది ఉంది. దీన్ని స్థానికులు టోనిక్ స్పా అని పిలుస్తారు.
బీచ్ లు : కంబోడియా సముద్రతీరంలోని సిహనాక్ విల్లే. ఇక్కడ అన్నీ బీచ్‌లే. కోహ్‌రాంగ్. ఇదో అందమైన దీవి. తీరంలో తెల్లని ఇసుకా స్పటికంలా మెరిసే కనువిందు చేస్తుంది.

Comments

comments