Search
Sunday 22 April 2018
  • :
  • :
Latest News

విరుగుడు

Marrege-getup-image

అమ్మాయ్ మాధవీ! రేపు నీకు పెళ్లి చూపులు
ఆఫీస్ నుంచి త్వరగా వచ్చెయ్ ….
నాకు పెళ్లి చూపులా …ఎవరు? ఎందుకు? ఎప్పుడు వస్తారు..
అబ్బాయి, అబ్బాయి తల్లి, తండ్రి రేపు మనింటికి వస్తున్నారు …
అబ్బాయి తల్లి, తండ్రి వస్తారా… వాళ్ళెందుకు?
అదేంటే… వాళ్ళు చూడద్దా నిన్ను…
ఎందుకు చూడాలి?
ఎందుకేంటి? వాళ్ళకి నువ్వు నచ్చద్దా …
వాళ్ళకెందుకు నచ్చాలి?
ఇది మరీ బాగుంది వెధవ ప్రశ్నలూ నువ్వునూ…కాబోయే కోడలిని చూసి
నచ్చుకోవద్దూ …
నేను వాళ్ళకి ఎందుకు నచ్చాలి… అబ్బాయికి నచ్చితే చాలదా…
నీకేం మతి చలించిందా … పిచ్చి ముదిరింది రోకలి మెడకు చుట్టమన్నదట నీలాంటిదే …
అసలు నాకు పెళ్లి చూపులంటేనే ఆశ్చర్యంగా ఉంది… పైగా అబ్బాయితో పాటు అతని తల్లి, తండ్రి కూడా రావడమా ..
ఇందులో ఆశ్చర్యపోడానికేం ఉంది ? నీకు పెళ్లీడు రాలేదా … పెళ్లి చేసుకోవా …
వస్తే పెళ్లి చేసుకోవాలా … తప్పదా…
ఎలా తప్పుతుంది.. ? ఎవరైనా అమ్మాయి అయినా, అబ్బాయి అయినా ఒక వయసు వచ్చాక పెళ్లి చేసుకోవాలిగా…. అదే ఎందుకు అని అడుగుతున్నాను ….ఎందుకేంటే … పెళ్ళెందుకు
చేసుకుంటారు..
పిల్లల్ని కనడానికి, వాళ్ళని పెంచి పెద్ద చేయడానికేగా..
నీకు నిజంగానే పిచ్చెక్కింది.. ఏ మాత్రం అనుమానం లేదు.. పోనీ అంతే అనుకో …
అనుకో ఏంటి అంతే … మీరంతా చేసింది అదేకదా… జనాభా పెంచడానికి మీ వంతు కృషి చేశారు.
ఏవండి … మిమ్మల్నే … ఇలా రండి.. మీ కూతురు ఏవో సిద్ధాంతాలు మాట్లాడుతోంది…సిద్ధాంతాలు కాదమ్మా… పాయింట్‌కి వస్తున్నా … అసలే దేశంలో జనాభా పెరిగిపోతోందా…. నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నాయా? పెరిగే జనాభాకి సరిపడా నీళ్ళు , కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం చాలా అవస్థలు పడుతోందా.. జనం పెరగడం వలన ఉపాధి అవకాశాలు కూడా పెరిగి పరి

శ్రమలు వస్తున్నాయా? బోలెడన్ని వాహనాలు, బోలెడంత ఇంధనం, వీటి వలన బోలెడంత కాలుష్యం … బోలెడన్ని రోగాలు …
ఇదీ ఓ రోగమే కాబోలు…
అలా విసుక్కోకు మరి… నేను పెళ్లి చేసుకుని, పిల్లల్ని కని మరికొంత జనాభా పెరగడానికి కారణం అవుతాను కదా …
అయితే ఏంటి నీ నస … అందుకని పెళ్లి చేసుకోనంటావా …ఇలా బ్రహ్మచారిణిగా ముదిరిపోతావా…
పెళ్లి చేసుకోను… అలాగని బ్రహ్మచారిణిని కాను …
హవ్వ … అవేం మాటలే …. నలుగురు వింటే నవ్వి పోతారు…
అమ్మా … పెళ్లి చేసుకుంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోయి అతనితో బతకాలి కదా…
లేక నా నెత్తిన కూర్చుని ఇలా జీవితాంతం విసిగిస్తావా..
కదా… అలాంటప్పుడు పెళ్లి చేసుకోకపోయినా నేను అతనితో బతకచ్చుగా
ఛీ, ఛీ …
అదేనమ్మా … ఇలా చాలు ,
చాలు అంటూ మమ్మల్ని ఎదగనివ్వడంలేదు మీరు.. దేశం బాగుపడాలన్నా.. నాగరికత పెరగాలన్నా మా యువతరం తీసుకు వస్తున్న కొన్ని విప్లవాత్మక మార్పులని మీరు అంగీకరించాలి.. ఆశీర్వదించాలి.. పెళ్లి, సంసారం, అత్తామామలు, సేవలు, ఆడపడుచుల పెళ్ళిళ్ళు,
మరుదుల చదువులు, బాధ్యతలు… పిల్లల్ని కనడాలు, వాళ్ళని పెంచడాలు, వాళ్ళకి చదువులు, పెళ్ళిళ్ళ కోసం మా యవ్వనం అంతా కష్టపడి ఆస్తులు కూడపెట్టడం, ఓ మైగాడ్ … టోటల్ల్లీ బాక్ …. బాక్ …
యువత ముందుకు నడ వాలి….
మీరంతా వెనక ఉండి నడిపించాలి.. అందుకే నేను పెళ్లి చేసుకోను.. సహచర్యం చేస్తాను..
అలాగే … ఏవండి … మీ అమ్మాయి పెళ్లి కోసం
ఎఫ్‌డిలో దాచిన పదిలక్షలు రేపే డ్రా చేసి తీసుకురండి… కొత్తగా బంగారం షాపు ఒకటి పెట్టారుట.. అక్కడ కొత్త, కొత్త నగలు వచ్చాయిట నేను కొనుక్కుంటాను..

Comments

comments