Search
Tuesday 23 January 2018
  • :
  • :
Latest News

విద్యార్థిని ఆత్మహత్య

well

వరంగల్ : తల్లిదండ్రులు మందలించారన్న బాధతో ఓ విద్యార్థిని బావిలో దూకి ఆత్మహత్య చేసకుంది. ఖానాపురం మండలం మంగళవారిపేట శివారు రామలీల తండాకు చెందిన బోడి జవహర్‌లాల్, సునీత దంపతుల కూతురు సుజాత బుదరావుపేట హైస్కూల్‌లో తొమ్మిదో తరగతి చదువుతుంది. రెండు రోజులుగా సుజాత పాఠశాలకు వెళ్లకపోవడంతో తల్లిదండ్రులు మందలించారు. మంగళవారం సాయంత్రం నోట్ బుక్ కోసమని సుజాత బయటకు వెళ్లింది. ఆమె తిరిగి ఎంతకూ రాకపోవడంతో గ్రామంలో గాలించారు. అయినప్పటికీ సుజాత ఆచూకీ తెలియరాలేదు. బుధవారం ఉదయం సుజాత తండ్రి పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లడు. బావి దగ్గర సుజాత చెప్పులు , సైకిల్ కనిపించాయి. ఈ క్రమంలో బావిలో సుజాత మృతదేహం కనిపించింది. దీంతో సుజాత తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Committed Suicide

Comments

comments