Search
Saturday 21 April 2018
  • :
  • :

బస్సు కింద పడి విద్యార్థి మృతి

STUDENT

నిజామాబాద్ : బస్సు కింద పడి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది. మదన్ అనే విద్యార్థి ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాలేజీకి వెళ్లేందుకు మదన్ కంటేశ్వర్ బస్టాప్ వద్దకు వచ్చాడు. నిజామాబాద్ నుంచి మెట్‌పల్లికి వెళుతున్న బస్సు ఎక్కబోయి ప్రమావశాత్తు బస్సు కింద పడ్డాడు. బస్సు మదన్ తలపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Student Died in Road Accident

Comments

comments