Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అక్రమంగా తరలిస్తున్న రాయితీ గొర్రెల పట్టివేత

SHEEP

మహబూబాబాద్ : కేసముద్రంలో అక్రమంగా తరలిస్తున్న 210 గొర్రెలను పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘటనలో రెండు లారీలను సీజ్ చేసి , 16 మందిని అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు చెప్పారు. గొల్లకుర్మల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం రాయితీ గొర్రెలను పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరిస్తున్నప్పటికీ, లబ్ధిదారులు మాత్రం తమ పద్ధతిని మార్చుకోవడం లేదు. రాయితీ గొర్రెలను అక్రమంగా విక్రయించేవారి గురించి తమకు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరుతున్నారు.

Subsidy  Sheep Caught

Comments

comments