Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

పెద్ద పేచీ కాదు

cort

ప్రజల ముందు పెట్టాల్సినంత సీన్ లేదు 

ప్రభుత్వానికి లేఖ రాస్తాం
నలుగురు జడ్జీల తిరుగుబావుటాపై సుప్రీం బార్ కౌన్సిల్

న్యూఢిల్లీ: ప్రభుత్వం సమస్యను వీలైనంత త్వరగా పరిష్కరించాలని కోరుకుంటున్నామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా తెలిపింది. శనివారం బార్‌కౌన్సిల్ సమావేశమైంది. జడ్జీలతో చర్చలు జరిపి సమస్య పరిష్కరించేందుకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పా టు చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నా రు. మెమొరాండం ఆఫ్ ప్రొసీజర్స్ (ఎంఓపి)ని త్వర గా ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని కోరతామని బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్మన్ మనన్ కుమార్ మిశ్రా తెలిపారు. తాము సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో భేటీ అయ్యామని చెప్పారు. త్వరలోనే సుప్రీం కోర్టులో ఎంఒపిని పరిశీలించి తుది నిర్ణయం తీసుకుంటారని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. తాము కూ డా ప్రభుత్వానికి ఈ అంశంపై లేఖ రాయనున్నట్లు చెప్పారు. ఇదేం ప్రజల్లోకి తీసుకురావాల్సినంత పెద్ద విషయం కాదు అని అన్నారు.

Comments

comments