Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

తెలంగాణ సంప్రదాయాల పరిరక్షణకు జాగృతి కృషి

speak

*సమావేశంలో మాట్లాడుతున్న ప్రభుత్వ విప్ ఓదెలు

మన తెలంగాణ/జైపూర్ : తెలంగాణ సాంప్రదాయాలు సాంస్కృతిక కార్యక్రమాల పరిరక్షణకు తెలంగాణ జాగృతి ఎనలేని కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎంఎల్‌ఏ నల్లాల ఓదెలు అన్నారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో సంక్రాంతిని పురష్కరించుకొని మండలంలోని ఇందారం పాఠశాలలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతుల ప్రదానం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు ఎంపి కవిత, తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయలను ప్రపంచస్థాయికి తీసుకెళ్లిందన్నారు. తెలంగాణ జాగృతి చేసిన సేవలు అభినందనీయమన్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం అభినందనీయమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలకు ఆయన బహుమతులు అందించారు. ఈ కార్యక్రమంలో ఎంపిపి మెండే హేమలత, జడ్‌పిటిసి రాజ్‌కుమార్ నాయక్, జాగృతి జిల్లా అధ్యక్షుడు ఐదె ప్రశాంత్, టిఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు రిక్కుల మధూకర్‌రెడ్డి, చెన్నూర్ నియోజకవర్గం కోఆర్డినేటర్ రిక్కుల శ్రీనివాస్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ జక్కుల వెంకటేశం, ఎంపిటిసి సుంకరి విమల శ్రీనివాస్, స్థానిక టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Comments

comments