Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

వేసవిలో రానున్న ‘ఈ నగరానికి ఏమైంది’

tarun

తన మొదటి సినిమా ‘పెళ్లి చూపులు’తో బాక్సాఫీస్ హిట్‌ను అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్. ఆతర్వాత తన రెండవ సినిమాను రిలీజ్ చేయడానికి చాలా సమయం తీసుకుంటున్నాడు. ప్రముఖ నిర్మాత సురేష్‌బాబు రూపొందిస్తున్న చిత్రానికి తరుణ్‌భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగాన్ని పెంచుకుంది. ఈ చిత్రాన్ని కూడా తరుణ్ డిఫరెంట్‌గా తెరకెక్కించనున్నాడట. దీనికి ఒక వెరైటీ టైటిల్‌ను కూడా సెట్ చేసినట్లు తెలిసింది. ‘ఈ నగరానికి ఏమైంది’ అనే టైటిల్‌ను ఖరారుచేశాడట. ఈ చిత్రంలో హీరోయిన్‌గా అనీషా ఆంబ్రోస్ కనిపించనుండగా ‘వెళ్లిపోమాకే’ ఫేమ్ విశ్వక్ సేన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు. ఈ సినిమా ప్రారంభానికి ముందు దర్శకుడు నటీనటుల కోసం వర్క్‌షాప్ కూడా నిర్వహించాడు. ఇక వీలైనంత తొందరగా షూటింగ్‌ను పూర్తిచేసి వేసవిలో ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు తరుణ్ భాస్కర్ ప్లాన్ చేసినట్లు సమాచారం.

Comments

comments