Search
Saturday 21 April 2018
  • :
  • :

రెస్టారెంట్లపై టాస్క్ ఫోర్స్ దాడులు

food*కల్తీలపై నిరంతర దాడులు కొనసాగుతాయి  * సిఐ సుందరగిరి శ్రీనివాసరావు

*కల్తీలపై నిరంతర దాడులు కొనసాగుతాయి
*సిఐ సుందరగిరి శ్రీనివాసరావు
మనతెలంగాణ/కరీంనగర్‌క్రైం: నగరంలోని పలు రెస్టారెంట్లపై కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది గురువారం మెరుపు దాడులు నిర్వహించింది. రెస్టారెంట్ల లో సరైన జాగ్రత్తలు పాటించకుండా పాచీన, కుళ్ళిన, ఆహార పదార్థాలు విక్రయించడమే కాకుండా కుళ్ళిన మాంసంతో తయారు చేసిన వంటకాలను వడ్డీస్తున్నారనే సమాచారం మేరకు ఫుడ్ ఇన్‌స్పెక్టర్ తోపాటు దాడులు నిర్వహించారు. తినే బిర్యానీ ఆహారంలో తాళ్ళు, వెంట్రుకలు, పురుగులు మొదలైనవి వస్తున్నాయని పలువురు వి నియోగదారుల నుండి ఫిర్యాదులు అందడంతో టాస్క్‌ఫోర్స్ దాడులు నిర్వహించ డం జరిగింది.పెద్దపల్లి బైపాస్‌రోడ్‌లో గల మహమ్మద్ కాలిద్ హసద్‌కు చెందిన క్వా లిటీ ఇన్ రెస్టారెంట్‌పై దాడి చేసి భారీ మొత్తంలో కుళ్ళిన, పాచీన పదార్థాలను గు ర్తించడం జరిగింది.గత మూడు నుంచి నాలుగు రోజులుగా నిల్వ ఉంచిన మాం సం, బిర్యానీని వడ్డించడం గమనించి వాటిని వెంటనే సీజ్ చేసి అలాంటి పాడైన ఆ హార పదార్థాలను బయటకు తీసుకువెళ్ళి పడవేయడం జరిగింది. హోటల్ నుండి శాంపిల్స్ కలెక్ట్ చేసి వాటిని పరిశీలన నిమిత్తం ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఫుడ్ సేఫ్టీ ల్యాబోరేటరీకి పంపించడం జరిగింది. నివేదిక వచ్చిన వెంటనే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులు తెలియజేశారు.
మా అభిరుచి ఫ్యామిలీ దాబాపై…
నగరంలోని జగిత్యాల రోడ్‌లో గల మహ్మద్ నిజామోద్దీన్‌కు చెందిన మా అభిరుచి ఫ్యామిలీ దాబాపై కరీంనగర్ కమిషనరేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బంది ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో కలిసి దాడి చేయడం జరిగింది. గత కొన్ని రోజులుగా నిల్వ ఉంచిన కుళ్ళిన, పాచీన ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.వాటి నమూనాలను సేకరించి హోటల్ నిర్వాహకులపై కేసు నమోదు చేశారు.
గీతాభవన్‌పై సంతృప్తి వ్యక్తం
నగరంలోని తెలంగాణచౌక్ చౌరస్తాలో గల హారడి సందీప్‌శెట్టికి చెందిన గీతాభవన్ లో ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌తో యుక్తంగా హోటల్‌లో ప్రమాణాలు పాటిస్తూ, కిచెన్ సక్రమం గా ఉంచి నాణ్యతను పాటించగా సంతృప్తి వ్యక్తం చేయడం జరిగింది.
కల్తీలపై నిరంతర దాడులు కొనసాగుతాయి
టాస్క్‌ఫోర్స్ ఆధ్వర్యంలో కరీంనగర్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో నిరంతరం కల్తీలపై దాడులు కొనసాగుతాయని కరీంనగర్ కమీషనరేట్ టాస్క్‌ఫోర్స ఇంచార్జీ సిఐ సుందరగిర శ్రీనివాస్‌రావు తెలిపారు. ఇప్పటికైనా ఎలాంటి కల్తీలు జరగకుండా య జమానులు తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. లేనిపక్షంలో చట్టపరంగా తీవ్రమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. అక్రమ కార్యకలాపా లు, కల్తీలపై ఏలాంటి సమాచారం ఉన్నా వెంటనే తమకు సమచారం అందివ్వాలని సిఐ సుందరగిరి శ్రీనివాస్‌రావు ప్రజలను కోరారు. ఈ దాడుల్లో సిఐ కిరణ్ సహా ఎస్‌ఐ నాగరాజు,ఫుడ్ ఇన్‌స్పెక్టర్ రాజేంద్రనాథ్, కరీంనగర్ కమీషనరేట్ టాస్క్‌ఫోర్స్ సిబ్బందిఅనిల్,రాజశేఖర్, వసీం,రమేష్,శేఖర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు.
                                                                                                                                                         – సిఐ సుందరగిరి శ్రీనివాస్‌రావు

Comments

comments