Search
Friday 22 June 2018
  • :
  • :
Latest News

టిసిఎస్ లాభం 6,531 కోట్లు

bsns త్రైమాసికం ఆధారంగా 1.3 శాతం వృద్ధి
 అంచనాలను అందుకున్న ఐటి దిగ్గజం

న్యూఢిల్లీ : మూడో త్రైమాసిక ఫలితాల్లో(అక్టోబర్‌డిసెంబర్) దేశీయ అతిపెద్ద ఐటీ సంస్థ టిసిఎస్(టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్) నికర లాభం స్వల్పంగా 1.3 శాతం వృద్ధిని సాధించింది. డిసెంబర్ ముగింపు నాటి క్యూ3లో నికర లాభం రూ.6,531 కోట్లు నమోదు అయింది. అంతకుముందు క్యూ2(జులైసెప్టెంబర్)లో లాభం రూ.6,446 కోట్లతో పోలిస్తే స్వల్పంగా వృద్ధిని నమోదు చేసింది. విశ్లేషకుల అంచనాల ప్రకారం డిసెంబర్ త్రైమాసికంలో టిసిఎస్ రూ.6532.70 కోట్ల నికర లాభాలను ఆర్జిస్తుందని అంచనా.. అయితే నిపుణుల అంచనాలకు అనుగుణంగానే ఫలితాలు ఉన్నాయి.
రూ.7 మధ్యంతర డివిడెండ్
త్రైమాసికంత్రైమాసికం ఆధారంగా చూస్తే ఐటి దిగ్గజం మొత్తం ఆదాయం రూ.31,774 కోట్లతో 1.32 శాతం పెరిగింది. కంపెనీ షేరుకు 7 రూపాయల చొప్పున మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. 2016 జనవరి 31 నాటికి ఈక్విటీ వాటాదారులకు మూడో మధ్యంతర డివిడెండ్‌ను చెల్లించనుంది.
మెరుగ్గా రాణించాం: టిసిఎస్ సిఇఒ
ఒప్పందాలు, వేగవంతమైన క్లయింట్ మెట్రిక్స్, పరిశ్ర అంతటా విశాలమైన డిమాండ్‌తో డిసెంబర్ త్రైమాసికంలో పటిష్ఠమైన పనితీరును ప్రదర్శించామని టిసిఎస్ సిఇఒ, ఎండి రాజేష్ గోపీనాథ్ అన్నారు. ఫైనాన్స్, కాస్ట్‌లకు ముందు కంపెనీ లాభాలు 2 శాతం పెరిగి రూ.8651 కోట్ల్లుగా ఉన్నట్టు కంపెనీ పేర్కొంది. 50 మిలియన్ ప్లస్ డాలర్ల వరకు ముగ్గురు క్లయింట్లను, 20 మిలియన్ ప్లస్ డాలర్ల వరకు ఏడుగురిని, 10 మిలియన్ ప్లస్ డాలర్ల వరకు తొమ్మిది మందిని, 5 మిలియన్ ప్లస్ డాలర్ల వరకు 15 మంది క్లయింట్లను చేర్చుకున్నట్టు టిసిఎస్ వెల్లడించింది. క్యూ3లో తాము తొలిసారి 50 మిలియన్ ప్లస్ డాలర్ల డీల్‌పై సంతకం చేశామని, డిజిటల్ టెక్నాలజీస్‌లో తాము ఎంతో కీలకమైన మైలురాయిని అధిగమించామని టిసిఎస్ సిఇఒ గోపినాథన్ తెలిపారు. కన్సాలిడేటెడ్ బేసిస్‌లో మొత్తం ఉద్యోగుల సంఖ్య క్యూ3లో 39,0880కి పెరిగింది.
స్థూలంగా కంపెనీలోకి తీసుకున్న ఉద్యోగులు 12,534 మంది ఉండగా, నికరంగా 1,667 మంది ఉన్నారు. ఫలితాల వెల్లడికి ముందు నేషనల్ స్టాక్ ఎక్సేంజ్‌లో టిసిఎస్ స్టాక్ విలువ అర శాతం పడిపోయి రూ.2,792.50 వద్ద స్థిరపడింది.

Comments

comments