Search
Sunday 21 January 2018
  • :
  • :

విద్యారంగ అభివృద్ధికి.. ఉపాధ్యాయులు కృషి చేయాలి

bouque

*వివిధ కార్యక్రమాల్లో పాల్గొని క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి జగదీష్‌రెడ్డి

మనతెలంగాణ/సూర్యాపేట: ఉపాధ్యాయులు విద్యా వ్యవస్థ బలోపేతానికి కృషి చేయాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం టియూటిఎఫ్ ఉపాధ్యాయ సంఘ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ ప్రభుత్వం పిల్లల విద్యకు ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుందని , దానిని దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయు లు , విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ సంఘ నాయకులు దామెర శ్రీనివాస్, బెల్లంకొండ పర్వతాలు, కిషన్, ప్రసాద్, జానకిరాములు, చలమందరావు, నర్సింహా
రావు, చంద్రశేఖర్, జవహార్, శ్రీనివాసచారి తదితరులు పాల్గొన్నారు.
టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో
టిపిటిఎఫ్ ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో నూత న సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి జగదీష్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పుప్పాల రవికుమార్, భిక్షం, ముత్తయ్య, శ్రీనివాస్, హన్మంతరావు, మల్లారెడ్డి, వీరన్న, యాకయ్య తదితరులు పాల్గొన్నారు.
బ్యాంక్ సేవలు డిపాజిట్ దారులు వినియోగించుకోవాలి
బ్యాంక్‌లు అందించే సదుపాయాలను వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధిశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణ కేంద్రంలోని సుధాబ్యాంక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇంటింటికి సుధాబ్యాంక్ వసుధ యాప్‌ను ఆయన ప్రారంభించి మాట్లాడుతూ సమాజంలో అందరి మన్ననలు పొందుతూ మున్ముందు ఉన్నత శిఖరాలు చేరుకోవాలని ఆయన ఆదేశించారు. బ్యాంక్‌లు చిన్న మొత్తాలను డిపాజిట్‌లుగా స్వీకరించి అల్ప ఆదాయ వర్గాల వారికి రుణ సదుపాయం కల్పించేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. అనంతరం నూతన క్యాలెండర్, త్యాగరాజు ఉత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, సుధాబ్యాంక్ చైర్మన్ మీలా సత్యనారాయణ, టిడిపి నాయకులు పెద్దిరెడ్డి రాజా, టిఆర్‌ఎస్ నాయకులు బడుగుల లింగయ్యయాదవ్, కట్కూరి గన్నారెడ్డి, సుధాబ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్‌లు పెద్దిరెడ్డి గణేష్, పోరెడ్డి మధుసూదన్‌రెడ్డి, బోనగిరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Comments

comments