Search
Saturday 20 January 2018
  • :
  • :
Latest News

విరాట్ సేనకు సఫారీల చెక్!

 72 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి
 రెండో ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లు తీసి భారత్ నడ్డి విరిచిన వెర్నాన్ ఫిలాండర్
 1-0తో దక్షిణాఫ్రికా ఆధిక్యం

South-Africa

కేప్‌టౌన్: ఆతిథేయ దక్షిణాఫ్రికా జట్టు న్యూల్యాండ్స్ టెస్టులో పర్యాటక జట్టు టీమిండియాను 72 పరుగుల తేడాతో ఓడించింది. రెండో ఇన్నింగ్స్‌లో విరాట్ సేనను 135 పరుగులకే ఆలౌట్ చేసింది. దక్షిణాఫ్రికా జట్టు బౌలర్ వెర్నాన్ ఫిలాండర్ ఆరు వికెట్లు తీసుకుని చెలరేగిపోయాడు. అతడికి తోడు మోర్నే మోర్కెల్, కగిసో రబడా కూడా టీమిండియాకు కళ్లెం వేశారు. ఈ విజయంతో దక్షిణాఫ్రికా జట్టు మూడు టెస్టుల సిరీస్‌లో 10 ఆధిక్యతను దక్షిణాఫ్రికా జట్టు సాధించింది. 208 పరుగుల లక్ష ఛేదనకు దిగిన టీమిండియా జట్టును సఫారీ బౌలర్లు అడ్డుకున్నారు. ఫిలాండర్ బౌలింగ్‌ను భారత జట్టులోని టాప్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ ఎవరూ ఎదుర్కోలేకపోయారు. ఆదిలో టీమిండియా జట్టు మెరుగ్గానే కనిపించింది. మురళీ విజయ్ రెండుసార్లు డిఆర్‌ఎస్ ఉపయోగించుకుని ప్రయోజనాన్ని పొందాడు. కానీ శిఖర్ ధావన్ 16 పరుగులకు, విజయ్ 13 పరుగులకే అవుటయ్యాక భారత్ స్కోరు 30 వద్ద నిలిచింది. దాంతో విజయం మెల్లిగా దక్షిణాఫ్రికా జట్టువైపుకు మొగ్గు చూపడం మొదలైంది. నాలుగో వికెట్‌కు 32 పరుగుల భాగస్వామ్యాన్ని విరాట్ కోహ్లి(28), రోహిత్ శర్మ(10) నిలిపారు. ఫిలాండర్ చెలరేగక ముందు వారిద్దరు కొంత ఆశలు కల్పించారు.
తొలి ఇన్నింగ్స్‌లో అర్ధ శతకాన్ని చేసిన హార్దిక్ పాండ్య వికెట్‌ను రబడ తీయడంతో ఆట ప్రభావమంతంగా మారింది. కెప్టెన్ విరాట్ కోహ్లి దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కొనేలానే కనిపించాడు. కానీ రబడ అతడిని ఎల్‌బిడబ్లు చేయడంతో టీమిండియా ఓటమి తథ్యమనిపించింది.
రెండో సెషన్‌లో రవిచంద్రన్ అశ్విన్(37), భువనేశ్వర్ కుమార్(13) కొంత మేరకు దక్షిణాఫ్రికా జట్టును ఎదుర్కొన్నారు. వారిద్దరూ కలసి 49 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే ఫిలాండర్ 42 ఓవర్‌లో తన తొలి బంతికే అశ్విన్‌ను ఔట్ చేశాడు. ఫిలాండర్ మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాలను కూడా ఫిలాండర్ పెవిలియన్ బాట పట్టించాడు. ప్లేర్ ఆఫ్ ద మ్యాచ్: వెర్నాన్ ఫిలాండర్.

స్కోరు:
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 286/10 (73.1 ఓవర్లు)
డి. ఎల్గర్(సి)సాహా(బి)భువనేశ్వర్ 0, ఎ.మార్‌క్రమ్ (ఎల్‌బిడబ్లు) (బి)భువనేశ్వర్ 5, ఆమ్లా(సి)సాహా(బి) 3, ఎబి ది విల్లియర్స్ (బి)బుమ్రా 65, డుప్లెసిస్(సి) సాహ(బి) హార్దిక్ పాండ్య 62, డికాక్ (సి)సాహా(బి)భువనేశ్వర్ 43, వెర్నాన్ ఫిలాండర్(బి) షమీ 23, కేశవ్ మహారాజ్(రనౌట్)(అశ్విన్) 35, రబడ(సి)సాహా(బి)అశ్విన్ 26, స్టెయిన్(నాటౌట్) 16, మోర్నే మోర్కెల్ (ఎల్‌బిడబ్లు)(బి) అశ్విన్ 2. ఎక్స్‌ట్రాలు: 6, మొత్తం: 286.
వికెట్ల పతనం: 1–0, 27, 312, 4126, 5142, 6202, 7221, 8258, 9280, 10286.
బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 194874, షమీ 166471, బుమ్రా 191731, హార్దిక్ పాండ్య 121531, అశ్విన్ 7.11212.
భారత్ తొలి ఇన్నింగ్స్: 209/10 (73.4 ఓవర్లు)
మురళీ విజయ్ (సి) ఎల్గార్(బి) ఫిలాండర్ 1, శిఖర్‌ధావన్ (సి అండ్ బి) స్టెయిన్ 16, ఛెటేశ్వర్ పుజారా (సి)డుప్లెసిస్(బి) ఫిలాండర్ 26, విరాట్ కోహ్లి(సి)డికాక్(బి) మోర్కెల్ 5, రోహిత్ శర్మ (ఎల్‌బిడబ్లు)(బి)రబడ 11, అశ్విన్ (సి) డికాక్(బి)ఫిలాండర్ 12, హార్దిక్ పాండ్య (సి)డికాక్(బి)రబడ 93, వృద్ధిమాన్ సాహా(ఎల్‌బిడబ్లు)(బి) స్టెయిన్ 0, భువనేశ్వర్ కుమార్(సి)డికాక్(బి)మోర్కెల్ 25, షమీ(నాటౌట్) 4, సస్ప్రీత్ బుమ్రా(సి)ఎల్గార్(బి)రబడ 2. ఎక్స్‌ట్రాలు: 14. మొత్తం: 209.
వికెట్ల పతనం: 116,218, 327, 457, 576, 681, 792, 8191, 9199, 10209. బౌలింగ్: ఫిలాండర్ 14.38333, స్టెయిన్ 17.36512, మోర్కెల్ 196572, రబడ 16.44343, కేశవ మహారాజ్ 60200.
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 130/10 (41.2 ఓవర్లు)
ఎయిడెన్ మర్‌క్రమ్ (సి)భువనేశ్వర్(బి) హార్దిక్ పాండ్య 34, డీన్ ఎల్గార్ (సి) సాహా(బి) హార్దిక్ పాండ్య 25, రబడ(సి)కోహ్లి(బి) షమీ 5, ఆమ్లా(సి)రోహిత్(బి)షమీ 4, ఎబి డివిల్లియర్స్ (సి)భువనేశ్వర్(బి)బుమ్రా 35, డుప్లెసిస్(సి)సాహ(బి) బుమ్రా 0, డికాక్(సి)సాహా(బి)బుమ్రా 8, ఫిలాండర్(ఎల్‌బిడబ్లు)(బి)షమీ 0, కేశవ్ మహారాజ్ (సి)సాహా(బి)భువనేశ్వర్ 15, మోర్కెల్(సి) సాహా(బి)భువనేశ్వర్ 2, స్టెయిన్(నాటౌట్)0. ఎక్స్‌ట్రాలు: 2. మొత్తం: 130. వికెట్ల పతనం: 152, 259, 366, 473, 582, 692, 7956, 8122, 9130, 10130. బౌలింగ్: భువనేశ్వర్ కుమార్ 115332, బుమ్రా 11.21393, షమీ 123283, హార్దిక్ పాండ్య 60272, రవిచంద్రన్ అశ్విన్ 1030.
భారత్ రెండో ఇన్నింగ్స్: 135/10 (42.4 ఓవర్లు)
మురళీ విజయ్ (సి) డివిల్లియర్స్(బి)ఫిలాండర్ 13, శిఖర్ ధావన్ (సి)క్రిస్ మోరీస్(బి)మోర్కెల్ 16, ఛెటేశ్వర్ పుజారా (సి)డికాక్(బి)మోర్కెల్ 4, విరాట్ కోహ్లీ (ఎల్‌బిడబ్లు)(బి) ఫిలాండర్ 28, రోహిత్ శర్మ(బి) ఫిలాండర్ 10, వృద్ధిమాన్ సాహా (ఎల్‌బిడబ్లు)(బి)రబడ 8, హార్దిక్ పాండ్య(సి) డి విల్లియర్స్(బి)రబడ 1, అశ్విన్ (సి)డికాక్(బి)ఫిలాండర్ 37, భువనేశ్వర్ కుమార్(నాటౌట్) 13, షమీ(సి) డుప్లెసిస్(బి)ఫిలాండర్ 4, బుమ్రా(సి)డుప్లెసిస్(బి) ఫిలాండర్ 0.
ఎక్స్‌ట్రాలు: 1. మొత్తం: 135. వికెట్లపతనం 130, 230, 339, 471, 576, 677, 782, 8131, 9135, 10135.
బౌలింగ్: ఫిలాండర్ 15.44426, మోర్కెల్ 111392, రబడ 122412, మహారాజ్ 41120,

Comments

comments