Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

అది కట్టుకోలేదని ధర్నా..!!

Dharna-image

నల్లగొండ హాలియా : నల్లగొండ జిల్లా అనుముల మండలం నాయుడుపాలెం చెందిన బాణావత్ కృష్ణానాయక్ అనే వ్యక్తి ఇంటి ఎదుట అధికారులు, గ్రామప్రజలు ధర్నాకు దిగారు. గ్రామస్థులంతా  తన ఇంటిలో మరుగుదొడ్డి కట్టుకోవాలని ఎంత చెప్పిన కృష్ణా అంగీకరించడం లేదు.  నాయుడుపాలెంను ప్రభుత్వం ఒడిఎఫ్‌గా ప్రకటించగా గ్రామస్థులంతా వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టుకున్నారు. ఎంత ఒత్తిడి చేసినా కృష్ణానాయక్ మాత్రం వాళ్ల మాటాలను పెడచెవిన పెట్టడంతో ఎంపిడిఓఒ జానయ్య, పంచాయతీ కార్యదర్శి రాజు, ఎంపిటిసి అంజమ్మ సర్దార్‌నాయక్, ఎపివొ ప్రవీణ్‌కుమార్, వార్డు సభ్యులు నెహ్రూ అతని ఇంటి ఎదుట బైఠాయించడంతో దెబ్బకు బాణావత్ కృష్ణానాయక్ దిగి వచ్చాడు. దీంతో అదికారులు నిరసన విరమించారు.

Comments

comments