Search
Sunday 21 January 2018
  • :
  • :

సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో మిన్న

mantri

ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్
మనతెలంగాణ/ఇల్లందకుంట:సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ ప్రభుత్వం, దేశంలోనే అగ్ర స్థానంలో ఉందని రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ అన్నా రు.గురువారం ఇల్లందకుంట మండలంలోని శ్రీరాములపల్లి, చిన్నకోమటి పల్లి, భూజునూరు గ్రామాల్లో డ బుల్ బెడ్ రూమ్ ఇండ్లకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభల్లో ఆయన మాట్లాడుతూ కొత్తగా ఏర్పడిన తె లంగాణ రాష్ట్రం పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమా ల్లో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచిందని అన్నారు. ప్రజల మనిషి కెసిఆర్ పేదల పాలిట దేవుడని, వినూ త్న కార్యక్రమాలను ప్రవేశ పెట్టి దేశం చూపు తెలంగా ణ రాష్ట్రం వైపు మరల్చిన ఘనత కెసిఆర్ దేనని మంత్రి ఈటెలఅన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు అన్యా యం,మోసం, తప్పుడు వాగ్దానాలు చేశాయి. గత కాం గ్రెస్, తెలుగు దేశం పార్టీలు ఇళ్లు కట్టుకోవడానికి 30 వేలు ఇచ్చాయి. ఇచ్చిన డబ్బుతో ఇళ్ల నిర్మాణం జరుగ క పేదలకు ఇల్లు అందలేదని అన్నారు. పేద ప్రజల ప క్షపాతి అయిన తెలంగాణ ప్రభుత్వం ఒక్కొక్క ఇంటిని 5 లక్షల 40 వేలు చెల్లించి గరీబోళ్ళకు నిర్మించి ఇస్తుందని తెలిపారు. అందరికి బియ్యం కార్డులు ఇచ్చాం. క ల్యాణలక్ష్మి,షాదిముబారక్ కార్యక్రమాల ద్వారా పే ద ఆడబిడ్డలకు పెళ్ళిళ్ళు చేస్తున్నామని అన్నారు. 170 రకాలైన కొత్త సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేదలకు అండగా ఉన్నామని తెలిపారు. హుజురాబాద్ నియోజకవర్గంలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం పని చురుకుగా సాగుతుందని అన్నారు. రానున్న ఎన్నికల్లో తె లంగాణ ప్రజలు టిఆర్‌ఎస్ పార్టీకి బ్రహ్మరథం పట్టనున్నారని అన్నారు. గ్రామాల అభివృద్ధి ప్రగతికి సోపానమని, అన్ని గ్రామాలకు రోడ్లు, పాఠశాల భవనాల వం టి మౌళిక సదుపాయాలు కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెం ట ఆర్‌డిఓ చెన్నయ్య, మార్కెట్ చైర్మన్ పింగలి రమేశ్, నగర చైర్మన్ పోడేటి రామస్వామి, ఎంఆర్‌ఓ రమేశ్, ఎండిఓ రమేశ్, గుడి చైర్మన్ సంజీవరెడ్డి, సురేందర్ రెడ్డి, గ్రామాల సర్పంచులు మేకల జయ లక్ష్మి, సంపత్, మండల పద్మమల్ల య్య, బుర్ర రమేశ్, వీరస్వామి యాదవ్, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు చుక్క రంజిత్, ఎంపిటిసిలు గుడెపు ఓదెలు, వీరారెడ్డి, వేముల జలపతి, రాజకుమారి, మొగిలిపాక కవిత, గొనే కవిత, వీరారెడ్డి, సిఐ నారాయణ, ఎస్‌ఐ నరేష్  పాల్గొన్నారు.

Comments

comments