Search
Monday 23 April 2018
  • :
  • :
Latest News

సమాజ అభివృద్ధ్దికి శాంతిభద్రతలే పునాది

djp

*ప్రపంచస్థాయిలో తెలంగాణ
 పోలీసులకు గుర్తింపు
*ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు
*డిజిపి మహేందర్‌రెడ్డి
సిద్దిపేట ప్రతినిధి : సమాజ అభివృద్ధ్దికి శాంతిభద్రతలే పునాదని, ప్రపంచ స్థాయిలో తెలంగాణ పోలీసుకు గుర్తింపు తెచ్చేలా కృషి చేస్తున్నామని డిజిపి మహేందర్‌రెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. నూతన సంవత్సరంలో తెలంగాణ పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ముందుకు వెళ్లడంతో పాటు అధునాతన సాంకేతికను అందిపుచ్చుకుని పనిచేస్తామన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చే విధంగా పనిచేయాలనే అధికారులకు సూచిస్తూ రాష్ట్రంలోని అన్ని జిల్లాలో పర్యటించడానికి సిద్దిపేట కమిషనరేట్ నుంచి ప్రారంభించినట్టు తెలిపారు. నూతన సంవత్సరంలో పోలీస్ శాఖ మరింత వినూత్నంగా ప్రజల సంక్షేమానికి ఎలాంటి చర్యలు చేపట్టాలనే విషయంపై అధికారులతో చర్చిస్తున్నట్టు తెలిపారు. ప్రజలు సుఖ శాంతులతో జీవించే విధంగా పోలీసులు కృషి చేస్తున్నారని అన్నారు. సిఎం కెసిఆర్ గత మూడున్నర సంవత్సరాలుగా పోలీసు శాఖకు అన్ని రకాల మద్దతును ఇవ్వడమే కాకుండా పలు సూచనలు, సలహాలు ఇస్తుండటంతో అన్ని జిల్లాలో శాంతిభద్రతలు బావున్నాయని అన్నారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబడ్డారని, కొత్త సంవత్సరంలో దీన్ని అదే స్థాయిలో ముందుకు తీసుకువెళతామన్నారు. తెలంగాణ పోలీసులు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచేలా పనిచేయాలని అన్ని స్థాయిల్లో తాను ప్రత్యేకంగా సూచిస్తున్నానని పేద, ధనిక అనే తేడాలేకుండా పోలీసులు ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులపై స్పందిస్తారని స్ఫష్టం చేశారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ విధానంలో అందరినీ కలుపుకుని ముందుకు వెళతామని, ఈ విషయంలో తమ సిబ్బంది చర్యలతో ప్రజల్లో మంచి విశ్వాసాన్ని కలిగిస్తారని తెలిపారు.
తెలంగాణను శాంతిభద్రతల నిలయంగా చేయడానికి తమ వంతు కృషి చేస్తున్నామని, కలానుగుణంగా వస్తున్న మార్పులను ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. సిద్దిపేట కమిషనరేట్ పరిధిలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ పనుల పట్ల తాను సంతృప్తి చెందినట్టు తెలిపారు. అంతకు ముందు ఇందూర్ ఇంజనీరింగ్ కళాశాలలో కమిషనరేట్ పరిధిలోని పోలీసు అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐజి స్టీఫెన్ రవీంద్ర, సిపి వి.శివకుమార్‌లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దుద్దెడ వద్ద నిర్మిస్తున్న నూతన పోలీస్ కమిషనరేట్ నిర్మాణ పనులను, కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని డిజిపి పరిశీలించారు.

Comments

comments