Search
Friday 20 April 2018
  • :
  • :
Latest News

చదవడం, రాయడమైనా నేర్పని ప్రాథమిక మిథ్య

Students-image

బడుగు బాలలకు శాపంగా మారిన బడులు 

2016వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కనీస విద్యా సామర్థ్యాల సాధన ప్రగతిని బేరీజు వేయడానికి మానిటరింగ్ బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలు రాష్ట్రంలోని 1368 పాఠశాలలను పరిశీలించాయి. అందులో394 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 401 ఉన్నత, 109 కె.జి.బి.వి.,57 ఆదర్శ, 56 రెసిడెన్షియల్, 235 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను పరీక్షించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించాయి. 48 శాతం ప్రాథమిక, 46 శాతం ప్రాథమికోన్నత, 42 శాతం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కనీస సామర్థాలు లేవని ముఖ్యంగా తెలుగు చదవడం, రాయడం రాదని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ఈ బృందాలు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, సి.సి.ఇ., అకడమిక్ క్యాలెండరు అమలు, పాఠ్య పుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల బోధనా అభ్యాసాల ప్రక్రియలు, ప్రధానోపాధ్యాయుల నాయకత్వ లక్షణాలు వంటి పలు అంశాలపై విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాయి. అన్ని నివేదికల మాదిరిగానే ఈ నివేదికపై కూడా చర్యలు తీసుకోలేదని విద్యార్థుల కనీస సామర్థ్యాలను తాజాగా పరిశీలిస్తే రుజువవుతుంది. ఒక కొసమెరుపు ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించిన 1368 పాఠశాలలకు గాను కేవలం 37 స్కూళ్ల ఉపాధ్యాయులను అభినందించాలని కూడా నివేదికలో సూచించారు.

పిల్లలు పడుతూ లేస్తూ నడక నేరుస్తారు, మాటలు నేర్చుకుంటారు, పెద్ద అవుతున్న కొద్దీ టివి చూసి స్టెప్పు వేసి డాన్స్ నేర్చుకుంటారు, స్నేహితులతో కలసి చెట్లు ఎక్కడం తెలుసుకుంటారు, సైకిలు తొక్కడం నేర్చుకుంటారు, నేర్పుతారు కూడా, ఆటల నియమాలు తెలుసుకుంటారు. కొన్నిసార్లు వాళ్లే నియమాలను ఏర్పరుస్తారు. అమ్మ నాన్నలు, అన్నలు, అక్కల నుండి పాటలు నేర్చి ఇంకా మంచి రాగాలు అల్లుకొని పాడుతారు. తమ ఊహల ప్రపంచాన్ని బొమ్మల రూపంలో వేసి ఆనందిస్తారు. గోలీలాటలో గురి చూసి కొట్టడం, కబడ్డీ ఆటలో వొడుపుగా పట్టడం, ఎదుటి వారిని చిత్తు చేసే ఎత్తుగడ వేయడం నేర్చుకుంటారు. ఇన్ని విద్యలు నేర్వగలిగిన పిల్లలకు ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలోని అధిక శాతం పిల్లలకు మన బడులలో నిష్ణాతులైన గురువులున్నారు. అయినా ఈ పిల్లలు తెలుగు భాషను చదవడం రాయడంలో చాలా వెనుకబడుతున్నారు. గురువులు లేకున్నా ఏకలవ్యులలా అన్ని విద్యలు నేర్చిన ఈ పిల్లలు సంవత్సరాలుగా అదే పనిగా బడికి వస్తున్నా వీరికి అప్పటివరకు సుశిక్షితులైన ఉపాధ్యాయులు, రాష్ట్ర స్థాయి నుండి పాఠశాల వరకు ఎంతో అనుభవమున్న విద్యా యంత్రాంగం ఉండి కూడా వారికి సరైన చదువు నేర్పకపోవడానికి కారణం ఏమై ఉంటుందో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది.

బడికి కొన్ని సంవత్సరాలుగా వస్తున్న పిల్లలకు చదవడం రాయడం రావడం లేదని పలు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ప్రతి ఏటా ప్రభుత్వాలకు నివేదికలు సమర్పిస్తూనే ఉన్నాయి. ఈ నివేదికలు విడుదలైనప్పుడు జరిగే హడావిడి అంతా ఇంతకాదు. ఆ తర్వాత అందరూ మరిచిపోతారు. మళ్ళీ ఇంకో నివేదిక వచ్చేవరకు పాత నివేదికలలో ఉన్న లోపాలను సరి చేస్తామన్న ప్రసక్తి ఉండదు. సిఎల్‌ఐపి (CLIP), సిఎల్‌ఎపి(CLAP), ఎల్‌ఇపి (LEP), 3ఆర్స్ (3Rs) అని పలు పేర్లతో సంవత్సరానికి ఒక కొత్త కార్యక్రమం జరుపుతారే తప్ప రాయడం చదవడంలో వెనుకబడ్డ పిల్లలు ఆయా తరగతి సామర్థ్యాలను అందుకోవడానికి సిద్ధంగా ఉన్నారా లేదా అనే విషయాన్ని బేరీజు వేయకుండానే ఆయా తరగతుల సిలబస్ పూర్తి చేసే పనిలో యావత్ విద్యా వ్యవస్థ మునిగి ఉంటుంది పిల్లల సామర్థ్యాలను బొత్తిగా దృష్టిలో ఉంచుకోరు. ఇన్ని సంవత్సరాలు గా చదువు చెప్పడంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన విద్యా వ్యవస్థ అకస్మాత్తుగా తేరుకొని పదవ తరగతి పరీక్షల విషయంలో చేసే హడావిడి, సమీక్షలు, డైరెక్టర్ స్థాయి మొదలు కొని, కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులు ఉన్నత పాఠశాల ప్రధాన అధ్యాపకుల మీద పెట్టే ఒత్తిడి అంతా ఇంతా కాదు.

ఇది ప్రతి విద్యా సంవత్సరంలో జరుగుతున్న తతంగమే. ఇప్పుడు పదవ తరగతికి వచ్చిన పిల్లలు కూడా మూడు లేదా నాలుగవ తరగతి విద్యా ప్రమాణాలను సాధించలేకపోతున్నారు. లక్షలాది మంది పిల్లలు ఆత్మన్యూనతా భావానికి గురవుతున్నారు. వారిలో పుట్టుకతో వచ్చిన సృజనాత్మకత సన్నగిల్లుతున్నది. 6వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో విద్యార్థుల కనీస విద్యా సామర్థ్యాల సాధన ప్రగతిని బేరీజు వేయడానికి మానిటరింగ్ బృందాలు ఏర్పడ్డాయి. ఈ బృందాలు రాష్ట్రంలోని 1368 పాఠశాలలను పరిశీలించాయి. అందులో394 ప్రాథమిక, 116 ప్రాథమికోన్నత, 401 ఉన్నత, 109 కె.జి.బి.వి.,57 ఆదర్శ, 56 రెసిడెన్షియల్, 235 ప్రైవేటు పాఠశాలల విద్యార్థులను పరిశీలించి సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించారు. 48 శాతం ప్రాథమిక, 46 శాతం ప్రాథమికోన్నత, 42 శాతం ఉన్నత పాఠశాలల విద్యార్థులకు కనీస సామర్థాలు లేవని ముఖ్యంగా తెలుగు చదవడం, రాయడం రాదని ఈ నివేదిక తేల్చి చెప్పింది. ఈ బృందాలు ఉపాధ్యాయుల, విద్యార్థుల హాజరు, సి.సి.ఇ., అకడమిక్ క్యాలెండరు అమలు, పాఠ్య పుస్తకాల పంపిణీ, ఉపాధ్యాయుల బోధనా అభ్యాసాల ప్రక్రియలు, ప్రధానోపాధ్యాయుల నాయకత్వ లక్షణాలు వంటి పలు అంశాలపై విశ్లేషించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదించాయి. అన్ని నివేదికల మాదిరిగానే ఈ నివేదికపై కూడా తగు చర్యలు తీసుకోలేదని విద్యార్థుల కనీస సామర్ధ్యాలను తాజాగా పరిశీలిస్తే రుజువవుతుంది. ఒక కొసమెరుపు ఏమిటంటే రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించిన 1368 పాఠశాలలకు గాను కేవలం 37 స్కూళ్ల ఉపాధ్యాయులను అభినందించాలని కూడా నివేదికలో సూచించారు.ఈ సంవత్సరం కూడా చదవడం, రాయడం రాని పిల్లలకు 3ఆర్స్ (రీడింగ్, రైటింగ్, అర్థమెటిక్) కార్యక్రమం చేపట్టినా అది సక్రమంగా అమలు కాలేదని ఇటీవల పాఠశాల విద్యా కమిషనర్ చేసిన సమీక్షలో తెలిసింది.

ఈ మధ్య 16 జిల్లాలలో తొమ్మిది, పది తరగతులకు చెందిన సుమారు 400 మంది విద్యార్థులకు నాలుగవ తరగతి సామర్థ్యాలు గల నమూనా పత్రాలను ఇచ్చి మూల్యాంకనం చేశారు. ఇందులో కేవలం 68 మంది విద్యార్థులు మాత్రమే రాయడం చదవడం ప్రక్రియలను చేశారు. మిగిలిన విద్యార్థులకు రాయడం చదవడం రాలేదు. ఉదాహరణకు ఈ మూల్యాంకనంలో నక్షత్రం, కంప్యూటర్ బొమ్మలు వేసి వాటి పేరు రాయమని అడిగిన ప్రశ్నకు చాలా మంది పదవ తరగతి విద్యార్థులు జవాబు రాయలేక పోవడం గమనించవలసిన అంశం. ఇది నిజంగా మన విద్యా వ్యవస్థ పతన ధోరణికి అద్దం పడుతుంది. ఈ ఒక్క ప్రయోగంలోనే కాదు రాష్ట్రం లో చాలా సార్లు జరిగిన విద్యార్థుల మూల్యాంకనాలో ఇంచు మించు ఇలాంటి ఫలితాలే వచ్చాయి.

విద్యార్థులు తమ తరగతుల స్థాయి కన్నా అతి తక్కువ స్థాయిలో ఉండడం నిజంగా చాలా బాధకరంగా తోచింది. చాలా మంది విద్యార్థులు చిన్న చిన్న బొమ్మలు చూసి వాటి పేర్లను రాయలేకపోయారు. ద్విత్వాక్షరాలతో వచ్చే పదాలను అయితే రాయడంలో చాలా ఇబ్బంది పడ్డారు. వత్తులు లేని సరళ పదాలతో కూడిన చిన్న వాక్యాలను చదువలేకపోయారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ పిల్లలు బడులకు వస్తూనే ఉన్నారు. వీరి మూల్యాంకనలు చేస్తూనే ఉన్నారు కానీ వీరి సామర్థ్యాలను పెంచడం లో మన విద్యా వ్యవస్థ పూర్తిగా విఫలమైందనే చెప్పాలి. రాష్ట్రంలో తెలుగు మాధ్యమంలో చదువుతున్న 24 లక్షల మంది విద్యార్థులలో అధిక శాతం మంది ఆయా తరగతులకు అవసరమైనస్థాయిలో చదవడం రాయడం రాని వారే. వారి గురించే చర్చ. ఈ పరిస్థితి ప్రభుత్వ, ప్రైవేటు బదులలో కూడా ఇలాగే ఉందని గమనించాలి. హైదరాబాద్‌లోని ఒక ప్రైవేటు బడిలో ఒక బాలునికి నూటికి తొంబై మార్కులు వేస్తూ ఒక తరగతి నుండి పై తరగతికి పంపిస్తూ ఒక్కో తరగతికి ఫీజులు పెంచుతూ తల్లిదండ్రులను మోసపుచ్చిన ఉదంతం మా దృష్టిలోకి వచ్చింది. ఫీజులు అధికంగా ఉన్నాయని భరించడం లేకపోతున్నామని ఆ తల్లి తన కొడుకుని ప్రభుత్వ బడిలో ఏడవ తరగతిలో చేర్పించడానికి వెళ్ళినపుడు అక్కడి ప్రధానోపాధ్యాయుడు చిన్న పరీక్ష పెట్టారు. ఆ పరీక్షల్లో ఆ బాలుడి అజ్ఞానం, అసమర్థత బయటపడడంతో ఆ తల్లి పడిన మనోవేదన చెప్పడానికి అవివేకానది.

గత ఆరు సంవత్సరాల రిపోర్టు కార్డులన్నీ తెచ్చి టీచరుకు చూపించి ఆమె చాలా బాధపడింది. అన్ని రిపోర్టు కార్డులను. ప్రభుత్వ ఉపాధ్యాయుడు పెట్టిన పరీక్ష పత్రాన్ని తీసుకొని ప్రైవేటు బడికి పోయి గట్టిగా నిలదీయగా ఆ టీచరు చెప్పిన సమాధానం తో కంగు తినడం ఆ తల్లి వంతైంది. పిల్లలందరికి 9 లేదా ఆపైననే మార్కులు వేయాలని అప్పుడే తల్లిదండ్రులు మన పాఠశాల బాగా చెపుతున్నదని భావించి ఫీజులు చెల్లిస్తారని ఉపాధ్యాయులకు యాజమాన్యం సూచించినట్లు ఆ ప్రైవేటు టీచరు చెప్పడం నిజంగా మన పిల్లలను మనం ఎంత అంధకారంలో ఉంచుతున్నామో తెలియజేస్తున్నది. ఈ పరిస్థితికి కారణాల గురించి రాష్ట్ర విద్యా శాఖ అధికారులను అడిగితే దీనికి బాధ్యులు జిల్లా అధికారులని, ఉపాధ్యాయులని కొందరు ఇంకా ఒక అడుగు ముందుకేసి పాస్ ఫెయిల్ విధానం లేనందుకేఇలా జరుగుతున్నదని సమాధానం వస్తుంది. బడికి వస్తున్న పిల్లలకు చదువు నేర్పకపోగా వారిని ఫెయిల్ చేయాలనే వాదన విచిత్రంగా ఉంటుంది. ఫెయిల్ అయిన విద్యార్థులు చదువుకు దూరమవుతారు తప్ప చదవరని గమనించాలి. అయినా ఫెయిల్ విధానాన్ని అమలుచేస్తే మన బడులు 90 శాతం ఖాళీ అవుతాయి.

ఆపాటిదానికి ఇంత పెద్ద యంత్రాంగమే అవసరం లేదని భావిస్తారు. విద్యా వ్యవస్థలో ఉన్న వేల మంది అధికారులు, ఉపాధ్యాయులు ఇంటికి పోవలసిన పరిస్థితి తలెత్తుతుంది. తల్లిదండ్రులు ఈ విషయమై చాలా ఆందోళనకు గురి అవుతున్నారు. పిల్లలు అటూ ఇటూ కాకుండా పోతున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎవరిని అడగాలో తెలియని పరిస్థితి. ఉపాధ్యాయులను అడిగితే తమ తప్పు కాదు పిల్లల తప్పని ఇంకా గట్టిగా అడిగితే తల్లిదండ్రులుగా మీ బాధ్యత కూడా ఉందని వారు వాగ్వివాదానానికి దిగడంతో చేసేది లేక తమ బతుకులకు అంత చదువు రాదేమో అనే నిస్పృహతో తల్లిదండ్రులు వెనుదిరిగిన సంఘటనలు అనేకం. ఇంకా కొన్ని ఉన్నత పాఠశాలల్లో పదవ తరగతి ఉత్తీర్ణత శాతం పెరగాలని ప్రభుత్వ నుండి వస్తున్న ఒత్తిడి తట్టుకోలేక ప్రధాన ఉపాధ్యాయులు చదువులో వెనక బడిన పదవ తరగతి పిల్లలకు టిసిలు ఇచ్చి హాజరు పట్టిక నుండి తొలగించి ప్రైవేటుగా పరీక్షలు రాసుకోమని సెలవిస్తున్నారు. తమ ఇష్టపూర్తిగానే టిసి తీసుకుంటున్నట్లు ఒక హామీ పత్రం కూడా తల్లిదండ్రులచేత రాయించుకుంటున్నారు.

పది సంవత్సరాలుగా బడికి వస్తున్నా చదవడం, రాయడం విషయంలో పట్టించుకోకుండా, నిర్లక్ష్యం వహించి ఒక్క సారిగా పదవ తరగతిలో అందరూ పాస్ కావాలని ఉపాధ్యాయులపై ఒత్తిడి పెంచడం విచిత్రమైన విషయం. పిల్లలకు సరి అయిన బోధన అందుతుందా లేదా అనే విషయాన్ని ప్రాథమిక స్థాయిలోనే గమనించ కుండా పదవ తరగతి ఫలితాలు రావు, చదవడం రాయడంలో ప్రాథమిక తరగతులలోనే విద్యార్థికి పటిష్ఠమైన పునాది పడుతుందని నివేదికలు,పరిశోధనలు తెలుపుతున్నాయి. ఈ దుస్థితి అంతటికీ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి ఒక ముఖ్య కారణంగా బయటకు వస్తున్నది. మధ్యాహ్న భోజనం లెక్కలు, మండల సమావేశాలు, ట్రైనింగులు వంటి అన్ని పనులతో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి సరియిన సమయం ఉపాధ్యాయులకు దొరకడం లేదని వాపోతున్నారు. ఉపాధ్యాయులు ఎలాంటి భోదనేతర పనులు చేయరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కేవలం ఎన్నికల నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలు, జనాభా లెక్కలు తప్ప మరే ఇతర పనులను ఉపాధ్యాయులకు అప్పగించ రాదనీ చెపుతుంది. ఎన్నికల విధులను కూడా ఉపాధ్యాయులు ఎందుకు నిర్వహించాలని పలువురు విద్యావేత్తలు అభ్యంతరాలను వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పేదవర్గాల పిల్లలే తమ తరగతులను, పాఠాలను ఎందుకు త్యాగం చేయాలో బోధపడదు. ప్రైవేటు బడులకు వెళ్ళే పిల్లలకు ఇటువంటి అంతరాయాలు లేకుండా తరగతులు నిర్వహించడం కూడా అక్కడ అభ్యాసన ఫలితాలు కొంత మెరుగుగా ఉండటానికి కొంత కారణం కావచ్చు. ఎన్నికలు అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. పంచాయతీ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, శాసనసభ, పార్లమెంట్, మధ్యంతర ఎన్నికల వంటి వాటికి ఉపాధ్యాయులను బోధన బాధ్యతల నుండి తప్పించి వాడుకోవడం చూస్తే మన పాలకులకు మన పిల్లల చదువు పట్ల ఉన్న అశ్రద్ధ అర్థమవుతున్నది.

ఇవే కాకుండా ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాలలో పిల్లలు, ఉపాధ్యాయులు పాలుపంచుకోవాలని ఆదేశాలు జారీచేయడం కూడా ఈ దుస్థితికి కారణం అవుతున్నది. తెలంగాణ రాష్ట్రం ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పడినది. ఎన్నో కొత్త అశాలను రేకెత్తించింది. ప్రతి ఉపాధ్యాయుడు,పిల్లలు వారి తల్లిదండ్రులు అనేక ఉద్యమాలలో పాల్గొని తమ పిల్లల భవిష్యత్తు బాగుపడుతుందని ఆశించారు. ముఖ్యంగా మన విద్యావిధానం గత పాలకుల చేతిలో ధ్వంసం అయిందని పలు మార్లు ఉద్యమ సమయంలో నాయకులూ పదే పదే అభిప్రాయపడ్డారు. దానికి అనుగుణంగా విధానాలు మారాలి. మం డల, జిల్లా పరిషత్ యాజమాన్యాల కింద నడుస్తున్న ప్రభుత్వ బడులలో చదువుచున్నారు. ఈ పిల్లలలో అత్యధిక శాతం మందికి చదవడం, రాయడం రాకపోతే అది తెలంగాణా అభివృద్ధికి ఒక మచ్చ లాగ ఉండిపోతుంది. రాష్ట్రవ్యాప్తంగా పిల్లలందరి సామర్థాన్ని మూల్యాంకనం చేసి రాయడం చదవడం రాని పిల్లలకు ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించాలి, ఈ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఒక స్వయం ప్రతిపత్తి గల సంస్థను ఏర్పాటు చేయాలి.

పిల్లలందరికీ తెలుగు రాయడం చదవడం నేర్పించే ప్రక్రియను ఎప్పటికప్పుడు మూల్యాంకనం చేసి విద్యాశాఖకు తగు సూచనలు చేయాలి. పిల్లలందరికీ అయా తరగతుల సామర్ధ్యాలను అందించిన తరువాతనే విద్యా సిలబస్ ను మొదలు పెట్టాలి. ఈ ప్రక్రియలో ప్రజలను భాగస్వామ్యులను చేయాలి. ముఖ్యంగా పాఠశాల యాజమాన్య కమిటీల పాత్ర చాలా ము ఖ్యమైనదిగా గుర్తించాలి. అవసరమైతే విశ్రాంత ఉపాధ్యాయుల సేవలను తీసుకోవాలి. అప్పుడే మన పిల్లలందరూ తప్పులు లేకుండా రాయడం చదవడం సాధ్యమౌతుంది. అత్యంత వైభవంగా ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుకున్న రాష్ట్రంగా ఖ్యాతి గడించిన తెలంగాణలో బడులలో ఉన్న విద్యార్థులందరికీ ధారాళంగా తెలుగు రాయడం చదవడం నేర్పే ఒక వినూత్న ప్రయోగానికి నాంది పలికి సంవత్సరాల తరబడి విద్యా వ్యవస్థను పట్టి పీడుస్తున్న ఒక జటిలమైన సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టి ప్రభుత్వం మంచి విద్యా భవిష్యత్తు కు బాటలు వేయాలి.

ఈ దుస్థితి అంతటికీ ఉపాధ్యాయులపై బోధనేతర పనుల ఒత్తిడి ఒక ముఖ్య కారణంగా బయటకు వస్తున్నది. మధ్యాహ్న భోజనం లెక్కలు, మండల సమావేశాలు, ట్రైనింగులు వంటి అన్ని పనులతో విద్యార్థుల సామర్థ్యాలను పెంచడానికి సరియిన సమయం ఉపాధ్యాయులకు దొరకడం లేదని వాపోతున్నారు. ఉపాధ్యాయులు ఎలాంటి భోదనేతర పనులు చేయరాదని విద్యాహక్కు చట్టం స్పష్టంగా పేర్కొన్నది. కేవలం ఎన్నికల నిర్వహణ, ప్రకృతి వైపరీత్యాలు, జనాభా లెక్కలు తప్ప మరే ఇతర పనులను ఉపాధ్యాయులకు అప్పగించ రాదనీ చెపుతుంది. ఎన్నికల విధులను కూడా ఉపాధ్యాయులు ఎందుకు నిర్వహించాలని పలువురు విద్యావేత్తలు అభ్యంతరాలను వ్యక్త పరుస్తూనే ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి పేదవర్గాల పిల్లలే తమ తరగతులను, పాఠాలను ఎందుకు త్యాగం చేయాలో బోధపడదు. ప్రైవేటు బడులకు వెళ్ళే పిల్లలకు ఇటువంటి అంతరాయాలు లేకుండా తరగతులు నిర్వహించడం కూడా అక్కడ అభ్యాసన ఫలితాలు కొంత మెరుగుగా ఉండటానికి కొంత కారణం కావచ్చు. ఎన్నికలు అనే ప్రక్రియ నిరంతరం కొనసాగుతూనే ఉన్నది. పంచాయతీ, జిల్లా పరిషత్, కార్పొరేషన్, శాసనసభ, పార్లమెంట్, మధ్యంతర ఎన్నికల వంటి వాటికి ఉపాధ్యాయులను బోధన బాధ్యతల నుండి తప్పించి వాడుకోవడం చూస్తే మన పాలకులకు మన పిల్లల చదువు పట్ల ఉన్న అశ్రద్ధ అర్థమవుతున్నది. ఇవే కాకుండా ప్రభుత్వం తలపెట్టిన పలు కార్యక్రమాలలో పిల్లలు,ఉపాధ్యాయులు పాలుపంచుకోవాలని ఆదేశాలు జారీచేయడం కూడా ఈ దుస్థితికి కారణం అవుతున్నది.

                                                                                                                                       రేగట్టే వెంకట్‌రెడ్డి, సామాజిక కార్యకర్త
                                                                                                                                                             9949865516

 

 

Comments

comments